మూడు వైపుల డిస్‌ప్లేతో గెలాక్సీ నోట్ 4!

|

సామ్‌సంగ్ నుంచి భారీ అంచనాలలో విడుదలైన గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వర్గాలను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, గెలాక్సీ నోట్ 2 సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన గెలాక్సీ నోట్ 3 విశ్లేషకులను మెప్పించగలిగింది. మార్కెట్ వర్గాలను మెప్పించటంలో గెలాక్సీ ఎస్4 విఫలమైన నేపధ్యంలో గెలాక్సీ ఎస్5ను అత్యాధునిక ఫీచర్లతో సామ్‌సంగ్ తీర్చిదిద్దుతోంది.

 మూడు వైపుల డిస్‌ప్లేతో గెలాక్సీ నోట్ 4!

ఇటీవల సామ్‌సంగ్ మొబైల్ చీఫ్ లీ యంగ్ హీ తాము భవిష్యత్‌లో చేపట్టబోయే అధిక ముగింపు ఆవిష్కరణలకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. గెలాక్సీ నోట్ 3కి సక్సెసర్ వర్షన్‌గా రాబోతున్న గెలాక్సీ నోట్ 3 మూడు వైపుల డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుందిన తెలిపారు. 2014 ద్వితియార్థంలో ఈ మూడు వైపు డిస్‌ప్లే ఫాబ్లెట్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

గెలాక్సీ ఎస్5 విడుదల ఎప్పుడంటే..?

సామ్‌సంగ్ తరువాతి వర్షన్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. గెలాక్సీ ఎస్5ని 2014, మొదటి త్రైమాసికంలో ఆవిష్కరించే అవకాశముందని నిన్నమొన్నటి వరకు మార్కెట్లో వర్గాలు అంచనావేసాయి. గెలాక్సీ ఎస్5 విడుదల ఎప్పుడంటే..? తాజాగా, సామ్‌సంగ్ అభిమానుల సందేహాలను నివృత్తి చేస్తూ కంపెనీ డిజైన్ స్ట్రాటజీ విభాగపు ఉపాధ్యక్షుడు డూన్-హూన్ చాంగ్ గెలాక్సీ ఎస్5 ఆవిష్కరణ సమయం పై పెదవి విప్పారు. సియోల్‌లో నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశంలో గెలాక్సీ ఎస్5కు సంబంధించిన పలు ప్రశ్నలకు చాంగ్ సమాధానాలిచ్చారు. గెలాక్సీ ఎస్5‌ను ఫబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎక్స్ పోలో ప్రదర్శించే అవకాశముందా..?, గెలాక్సీ ఎస్5 మెటల్ బాడీ, ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యం కానుందా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు చాంగ్ దాదాపు అవుననే సమాధానాన్ని వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది. బార్సిలోనా వేదికగా ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎక్స్ పోను నిర్వహించనున్నారు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్3 కీలక స్పెసిఫికేషన్‌లు

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ వోక్టా‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, యూఎస్బీ, జీపీఎష్ ఎల్టీఈఏ కనెక్టువిటీ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.45,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X