5జీ సపోర్ట్‌తో హానర్ వ్యూ 30 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు

By Gizbot Bureau
|

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారీ దిగ్గజం హువాయి హానర్‌ సంస్థ పవర్‌ఫుల్‌ స్మార్ట్‌ఫోన్లను బీజింగ్‌లో లాంచ్‌ చేసింది. వ్యూ 30 సిరీస్‌లో మొదటి డ్యూయల్ మోడ్ 5 జి స్మార్ట్‌ఫోన‍్లను ఆవిష్కరించింది. వ్యూ 30, వ్యూ 30 ప్రో పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లలో 5జీ/4జీ 4 జి డ్యూయల్ మోడ్‌ను అమర్చింది. కాగా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ ఆధారంగా వినియోగదారులు 4జీ/5జీ నెట్‌వర్క్‌కు మారవచ్చని కంపెనీ తెలిపింది. తమ హానర్‌ వ్యూ 30 సిరీస్ ఇప్పటి వరకు అత్యంత వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లనీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితాలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందనీ హానర్‌ప్రెసిడెంట్‌ జార్జ్ జావో వెల్లడించారు. ఈ ఫోన్లతో పాటుగా పాటు, మ్యాజిక్‌బుక్14 , మ్యాజిక్‌బుక్15 పేరుతో సరికొత్త మ్యాజిక్‌బుక్ సిరీస్‌ను హానర్ ఆవిష్కరించింది.

వ్యూ 30 ప్రో ఫీచర్లు
 

వ్యూ 30 ప్రో ఫీచర్లు

6.57-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, 7ఎన్ఎమ్ ప్రాసెస్-బేస్డ్ కిరిన్ 990 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, 40+12+8 ఎంపీ ట్రిపుల్‌ రియల్‌ కెమెరా, 32 +8 ఎంపీ సెల్ఫీకెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ

వ్యూ 30 ధర

వ్యూ 30 ధర

6జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ , 8జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభించేనుంది. వీటి ధరలు వరుసగా 3,299 యువాన్లు (సుమారు రూ. 33,600). 3699 యువాన్లు ( సుమారు రూ. 37,700)

వ్యూ 30 ప్రో ధర

వ్యూ 30 ప్రో ధర

8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 3,899 యువాన్లు (సుమారు రూ.39,700) 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లు (సుమారు రూ. 42,800).

వ్యూ 30 ప్రో ఫీచర్లు
 

వ్యూ 30 ప్రో ఫీచర్లు

డ్యూయల్ పంచ్ హోల్‌, 40వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్, 27వా వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు, వ్యూ 30 దాదాపు ఇలాంటి ఫీచర్లతోనే డ్యుయల్‌ కెమరాల్లో 8ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్‌ సెల్ఫీ కెమెరా, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్‌ చేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Honor unveils View 30-series smartphones with 5G network support: Know more

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X