Honor View 20, మార్కెట్లోకి మరో అద్భుతమైన ఫోన్!

హువావే సబ్సిడరి బ్రాండ్ హానర్ ఎట్టకేలకు తన హానర్‌వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

|

హువావే సబ్సిడరి బ్రాండ్ హానర్ ఎట్టకేలకు తన హానర్‌వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. 6జీబి ర్యామ్ వేరియంట్ ఖరీదు రూ.37,999. ఈ మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో పలు అత్యాధునిక ఫీచర్లను హానర్ పొందుపరిచింది. ప్రపంచపు నెం.1 ఇన్నోవేషన్‌లను ఈ ఫోన్‌లో ఎక్విప్ చేసి ఉంచామని, డివైస్ లోని అన్ని విభాగాలు ఆధునిక అవసరాలకు అనుగుణంగా స్పందిస్తాయని కంపెనీ చెబుతోంది.

honor-view-20-class-leading-camera-gaming-and-multitasking-performance

ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ప్రపంచపు మొట్టమొదటి 48 మెగా పిక్సల్ హై-డెఫినిషన్ కెమెరా, అడ్వాన్సుడ్ టీఓఎఫ్ 3డీ సెన్సార్, ఇన్-స్ర్కీన్ సెల్ఫీ కెమెరా, 7ఎన్ఎమ్ కిరిన్ 980 చిప్‌సెట్స్ విత్ డ్యుయల్ ఎన్‌పీయూ వంటి స్పెసిఫికేషన్స్ ఫోన్ ను ఫోటోగ్రఫీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మల్టీమీడియా ఇంకా కనెక్టువిటీ విభాగాల్లో మరింత రాటుతేలేలా చేసింది.

ఫోటోగ్రఫీ ప్రియులకు కన్నుల పండగే..

ఫోటోగ్రఫీ ప్రియులకు కన్నుల పండగే..

హానర్‌వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 48 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ఫోటోగ్రఫీ ప్రియులకు కన్నుల పండగే అని చెప్పొచ్చు. ఈ కెమెరాతో క్యాప్చుర్ చేస్తోన్న ఫోటోలు కొత్త అనుభూతులను నింపుతున్నాయి. 48 మెగా పిక్సల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అల్ట్రా క్లారిటీ, ఏఐ ఆధారిత హెచ్‌డిఆర్ మోడ్స్ ఫోటోలను సహజసిద్థమైన అనుభూతులతో తీర్చిదిద్దుతున్నాయి. ముఖ్యంగా ల్యాండ్‌స్కేప్ సీనిక్ షాట్‌లను క్యాప్చుర్ చేసుకునే సమయంలో ఫోటో క్వాలిటీ అనేది మరింతగా ఉట్టిపడుతుంది.½ - ఇంచ్ సెన్సార్‌లో బిల్ట్ కాబడిన 48 మెగా పిక్సల్ కెమెరా యూనిట్ ప్రతి ఫోటోను కూడా బెస్ట్ క్లాస్ డిటెయిలింగ్, రిచ్ కలర్స్ ఇంకా హై డైనమిక్ రేంజ్‌తో క్యాప్చుర్ చేస్తోంది. ఈ ఫోన్ కెమెరాతో చిత్రకరించే ఎటువంటి షాట్స్ అయిన సరే ఏమాత్రం నిరుత్సాహపరచవు. మెచీన్ లెరినంగ్ అల్గారిథమ్స్ కెమెరా ఎండ్-రిజల్ట్స్‌ను మరింతగా మెరుగుపరిచాయి. ఇదే సమయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ పవర్ సహాయంతో ఈ కెమెరా 60 క్యాటగిరీలతో పాటు 1500 సినారియోలను రియల్ టైమ్‌లో గుర్తించగలుగుతోంది.

 

తక్కువ వెళుతురులోనూ తగ్గని జోరు..

తక్కువ వెళుతురులోనూ తగ్గని జోరు..

హానర్‌ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌లో ఎక్విప్ చేసిన సోనీ ఐఎమ్ఎక్స్586 48 మెగా పిక్సల్ సెన్సార్‌తో పాటు అప్‌గ్రేడెడ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబులిటీలు తక్కువ వెళుతురులోనూ హై-క్వాలిటీ ఫోటోలను ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. తక్కువ వెళుతరు కండీషన్స్‌లో షూట్ చేయవల్సి వచినపుడు నైట్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మోడ్ కెమెరా కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ సాధ్యమైనంత వరకు బ్లర్ ఫోటోలను క్రియేట్ చేయగలుగుతుంది.

లీడింగ్ – క్లాస్ ఫోటోగ్రఫీ మోడ్స్..

లీడింగ్ – క్లాస్ ఫోటోగ్రఫీ మోడ్స్..

హానర్‌ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన కెమెరా యాప్ అనేక ఉపయుక్తమైన మోడ్స్‌తో పాటు ఫిల్టర్స్‌ను ఆఫర్ చేస్తోంది. అవసరాన్ని బట్టి వీటిని ఉపయోగించుకోవటం ద్వారా బెస్ట్ క్వాలిటీ ఫోటోలను క్రియేట్ చేసుకునే వీలుంటుంది.

పోర్ట్రెయిట్ మోడ్, అపెర్చుర్ మోడ్, నైట్ మోడ్, క్రాఫ్టెడ్ ఫిల్టర్స్, టైమ్ ల్యాప్స్, లైట్ పెయింటింగ్, హెచ్‌డిఆర్, 3డీ పానోరమా, ఆర్టిస్ట్ మోడ్ ఇలా రకరకాల సదుపాయాలను ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్లను ఉపయోగించుకుని వీడియోలను బ్యాగ్రౌండ్ బ్లర్‌తో రికార్డ్ చేసుకునే వీలుంటుంది.

ఇదే సమయంలో రికార్డ్ చేసిన వీడియోలను రియల్ టైమ్ ఎఫెక్ట్స్‌ను కూడా అద్దుకునే వీలుంటుంది. సూపర్ స్లో మోషన్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా వీడియోలను 960 ఫ్రేమ్స్ పర్ సెకన్ రేటులో క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది.

 

రియల్-వరల్డ్ అప్లికేషన్స్ కోసం 3డీ టీఓఎఫ్ కెమెరా

రియల్-వరల్డ్ అప్లికేషన్స్ కోసం 3డీ టీఓఎఫ్ కెమెరా

హానర్‌ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌కు 3డీ టీఓఎఫ్ కెమెరా మరో ప్రధానమైన హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో అమర్చబడిన ఈ అడ్వాన్సుడ్ రేర్ కెమెరా సిస్టం ఇన్ ఫ్రారెడ్ లైట్ సహాయంతో ఫోన్‌కు, సబ్జెక్టుకు మధ్య దూరాన్ని లెక్కించగలుగుతుంది. దీనిని ఆధారంగా చేసకుని న్యాచురల్ డెప్త్‌ను అప్లై చేయటం జరుగుతంది. 3డీ షేపింగ్, 3డీ మోషన్- కంటోల్డ్ గేమ్, 3డీ మ్యాపింగ్ వంటి రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది.

మోస్ట్ అడ్వాన్సుడ్ 7ఎన్ఎమ్ చిప్‌సెట్

మోస్ట్ అడ్వాన్సుడ్ 7ఎన్ఎమ్ చిప్‌సెట్

హానర్‌ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్‌లో మోస్ట్ అడ్వాన్సుడ్ మొబైల్ చిప్‌సెట్‌ను హువావే వినియోగించింది. 7ఎన్ఎమ్ ప్రాసెస్ పై బిల్ట్ కాబడిన చిప్‌సెట్‌లో కిరిన్ 980 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసర్‌ను పొందుపరిచారు. డ్యుయల్ ఎన్ పీయూలో ప్యాక్ అయి ఉన్న ఈ సీపీయూ 10ఎన్ఎమ్ చిప్‌సెట్‌లతో పోలిస్తే ఫోన్ స్పీడ్‌ను 20శాతానికి పెంచటంతో పాటు బ్యాటరీ పవర్‌ను 40శాతం వరకు ఆదా చేయగలుగుతుందట. ఇదే సమయంలో అంతరాయంలోని మల్టీటాస్కింగ్‌ను ఈ చిప్‌సెట్‌ ప్రొవైడ్ చేయగలుగుతుంది.

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ఇక ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే హానర్‌ వ్యూ 20 6జీబి ఇంకా 8జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 128జీబి, 256జీబి స్టోరేజ్ వెర్షన్‌లలో ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక గేమింగ్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌లో గేమింగ్ రియలాస్టిక్ అనుభూతులకు లోను చేస్తుంది.

ఫుల్ స్ర్కీన్ బిజెల్ లెస్ డిస్‌ప్లే

ఫుల్ స్ర్కీన్ బిజెల్ లెస్ డిస్‌ప్లే

ఫుల్ స్ర్కీన్ బిజెల్ లెస్ డిస్‌ప్లే పై గేమింగ్ విజువల్స్ మరింత అబ్బురపరిచే విధంగా ఉంటాయి. డివైస్‌లో పొందపరిచిన మాలీ జీ76 జీపీయూ, అత్యాధునిక గ్రాఫిక్ ఇంజిన్‌‌తో హై-క్వాలిటీ గేమింగ్‌ను ఆఫర్ స్తుంది. ఫోన్‌లో ఎక్విప్ చసిన నైన్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు చల్లబరుస్తూ అంతరాయంలేని గేమింగ్ సెషన్స్‌ను ప్రొవైడ్ చేస్తుంది.

'Triple-Antenna Wi-Fi' టెక్నాలజీ

'Triple-Antenna Wi-Fi' టెక్నాలజీ

ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఫోన్‌లో ఎక్విప్ చేసిన 'Triple-Antenna Wi-Fi' టెక్నాలజీ నెట్‌వర్క్ కనెక్టువిటీ ఏ మాత్రం డ్రాప్ అవ్వకుండా చూస్తుంది. అదనంగా యాడ్ చేసిన లింక్ టర్బో అనే ఫీచర్ నెమ్మదైన వె-ఫై కనెక్షన్‌ను డిటెక్ట్ చేసి వెంటనే బెటర్ నెట్‌‌వర్క్‌కు స్విచ్ చేసే ప్రయత్నం చేస్తుంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి శక్తివంతమైన 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో లోడ్ చేసారు. హువావే సూపర్ ఛార్జ్ టెక్నాలజీని ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. దీంతో 30 నిమిషాల పాటు ఫోన్ ఛార్జ్ చేేసినట్లయితే 55 శాతం ఛార్జింగ్ లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Honor View 20: Class-leading camera, gaming and multitasking performance. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X