ఈ ఫోన్‌ని ల్యాప్‌టాప్‌గా,డెస్క్‌టాప్‌గా వాడుకోవచ్చు

Written By:

ఐటీలో దూసుకుపోతున్న హెచ్‌పీ తన లేటెస్ట్ ప్రొడక్ట్‌తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింతి. వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌‌లో తన ఫ్లాగిష్ట్ మోడలైన హెచ్‌పి ఎలైట్ ఎక్స్ 3 స్మార్ట్‌ఫోన్‌తో అందర్నీ షాక్‌కు గురిచేసింది.ఎండబ్ల్యూసీలో ఈ ఫోన్‌ని చూసిన కంపెనీలు షాక్ తిన్నట్లుగా మారిపోయాయి. విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టంతోపాటు మైక్రోసాఫ్ట్ ఫీచర్స్ అన్ని ఇందులో పనిచేయనుండటం గమనార్హం.

ఈ ఫోన్‌ని ల్యాప్‌టాప్‌గా,డెస్క్‌టాప్‌గా వాడుకోవచ్చు

ఇంకా చెప్పాలంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తంగా కంప్యూటర్ లాగానే వ్యవహరిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటే కేవలం ఇందులోని ఫీచర్స్ ఆధారంగా ల్యాప్‌టాప్‌గా, డెస్క్‌టాప్‌గా వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న రెండో స్మార్ట్‌ఫోన్ ఎలైట్ ఎక్స్3. గతంలోనూ హెచ్‌పి ఇలాంటి మోడల్‌ను విడుదల చేసింది.

ఈ ఫోన్‌ని ల్యాప్‌టాప్‌గా,డెస్క్‌టాప్‌గా వాడుకోవచ్చు

మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆరు అంగుళాల తాకే తెర (టచ్ స్క్రీన్) ఉంటుంది. విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో విండోస్ 10 'కంటిన్యూమ్' ఫీచర్ స్పెషల్ అట్రాక్షన్. దీనిద్వారా ఎలైట్ ఎక్స్ 3 ని ల్యాప్‌టాప్‌గా, డెస్క్‌టాప్‌గా వాడుకోవచ్చు. మరి ఇందులో ఫీచర్స్‌పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: రిలయన్స్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎలైట్ ఎక్స్3 లోని ఫీచర్స్

5.96-అంగుళాలు, గొరిల్లా గ్లాస్ -4 ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్‌ప్లే చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. 1440x2560 రిజల్యూషన్

ఎలైట్ ఎక్స్3 లోని ఫీచర్స్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 820 ప్రాసెసర్‌తో 2.15GHz క్వాడ్ కోర్ తో రన్ అవుతుంది. 4150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఎలైట్ ఎక్స్3 లోని ఫీచర్స్

4 జీబీ ర్యామ్ తో పాటు ఇన్‌బుల్ట్ స్టోరెజ్: 64 జీబీ వరకు ఉంటుంది. అదనపు స్టోరేజ్ కోసం మైక్రో ఎస్డీ కార్డ్ ని ఉపయోగించుకోవచ్చు.

ఎలైట్ ఎక్స్3 లోని ఫీచర్స్

కెమెరా: 15 మెగా పిక్సల్ కెమెరాతో అదిరిపోయే విధంగా హెచ్ డి క్వాలిటీ ఫోటోలు తీసుకోవచ్చు.

ఎలైట్ ఎక్స్3 లోని ఫీచర్స్

8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. మీరు దిగే సెల్ఫీలు చాలా క్వాలిటితో వస్తాయి.

ఎలైట్ ఎక్స్3 లోని ఫీచర్స్

విండోస్ 10 మీద రన్ అయ్యే మొబైల్ ఇది. వైఫై కనెక్టివిటీ ఉంటుంది. 3జి, 4జీ సపోర్టడ్ సిమ్

ఎలైట్ ఎక్స్3 లోని ఫీచర్స్

ధర ఇంకా అనౌన్స్ చేయలేదు. బడ్జెట్ లోనే ఉండే అవకాశం ఉంది.

దీనిలోని ప్రత్యేకత ఏంటేంటే

దీనిలోని ప్రత్యేకత ఏంటేంటే మీరు సిస్టం మాదిరిగా ఈ మొబైల్ ని వాడుకోవచ్చు. అలాగే ల్యాపీగానూ వాడుకోవచ్చు. 

దీనికి సంబంధించిన వీడియో ఇదే

దీనికి సంబంధించిన వీడియో ఇదే 

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ పొందాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write HP Elite x3 First Look and Features
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot