32మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ తో మార్కెట్లోకి లాంచ్ కానున్న Huawei Nova 4e

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువాయి మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువాయి మొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది.గతంలో విడుదలైన Nova 4 కి కొనసాగింపుగా హువాయి Nova 4e ను రేపు చైనా మార్కెట్లో లాంచ్‌ చేయనుంది.ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్‌ కెమెరాలను అమర్చింది. అలాగే 18.9డిస్‌ప్లే ప్రత్యేకతగా ఉండనున్నాయి. కాగా ఈ ఫోన్ పర్ల్ వైట్,మ్యాజిక్ నైట్,గార్నెట్ బ్లూ కలర్స్‌లో వినియోగదారులను అలరించనున్నాయి.అయితే ఈ ఫోన్ యొక్క ధర పై కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

రూ.200 ధరలో లభించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండిరూ.200 ధరలో లభించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి

ఫీచర్లు

ఫీచర్లు

6.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 24, 8,2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3240 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

డిస్‌ప్లే :

డిస్‌ప్లే :

6.15 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2340x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

కెమెరా :
 

కెమెరా :

బ్యాక్ కెమెరా విషయానికొస్తే 24, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరాతో వినియోగదారులు మంచి ఫోటోలు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు .సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 32మెగాపిక్సల్ తో మంచి క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలు తీసుకునేలా కల్పించారు.

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ :

అలాగే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా ఇది మంచి పనితీరును కనపరుస్తోంది.హువాయి కస్టమ్ అయిన octa-core processorతో పాటు Kirin 710తో ఈఫోన్ రాబోతుంది . ఇది వేగవంతమైన పనితీరును అందిచబోతుంది .ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ లలో లభ్యమవుతోంది. FM radio, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ . అదనపు ఆకర్షణలు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ :

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ :

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 3240 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Huawei Nova 4e high resolution renders leaked ahead of March 14 launch.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X