జియో వల్ల లాభమెంతా..? నష్టమెంత..?

ఉచిత ఆఫర్లతో కోట్లాది మంది యూజర్లను కైవసం చేసుకున్న రిలయన్స్ జియో ఇండియన్ టెలికం మార్కెట్లో పెను దుమారాన్నే రేపిందని చెప్పొచ్చు. జియో లాంచ్ అయిన తరువాత మార్కెట్లో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చర్చించుకుందాం..

Read More : 30 రోజుల్లో 63 లక్షల ఫోన్‌లు అమ్మేసారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీ నెట్‌వర్క్ మరింత పాపులర్

జియో రాకతో 4జీ ఇంటర్నెట్ 2జీ, 3జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే మరింత చౌకగా అయిపోయంది. జియో తన కనెక్షన్‌లను ఉచితంగా అందించటంతో 2జీ, 3జీ కన్నా వేగంగా 4జీ నెట్‌వర్క్ మార్కెట్లో పాపులర్ అయ్యింది.

6 నెలల పాటు ఉచిత ఆఫర్లు..

జియో దాదాపు 6 నెలల పాటు తన 4జీ నెట్‌వర్క్‌ను ఉచితంగా ఆఫర్ చేయటంతో జియో 4జీ వోల్ట్ నెట్‌వర్క్‌కు చాలా మంది అలవాటు పడిపోయారు. జియో తన ఉచిత సేవలను నిలిపివేసినప్పటికి జియో ధన్ దనా ధన్ పేరుతో చౌక రేట్లకే 4జీ ఇంటర్నెట్‌ను ఆఫర్ చేస్తుండటంతో 4జీ డేటా ఇప్పటికి చౌకైన ఇంటర్నెట్ గానే మిగిలిపోయింది.

భారీగా తగ్గిన 4జీ డేటా రేట్లు..

రిలయన్స్ జియో రాకతో నష్టాలను చవిచూస్తోన్న భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వంటి టెల్కోలు 4జీ డేటా రేట్లను భారీగా తగ్గించక తప్పలేదు. జియో రాకతో రోమింగ్ ఛార్జీలు కూడా దిగిరాక తప్పలేదు. రిలయన్స్ జియో యూజర్లు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎటువంటి రోమింగ్ ఛార్జీలు లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రూ.3కే ఇంటర్నెషనల్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని జియో కల్పిస్తోంది.

డీటీహెచ్ విభాగంలోనూ సత్తాను చాటుకునే ప్రయత్నం..

జియో ఒక్క టెలికం మార్కెట్‌నే కాదు బ్రాడ్‌బ్యాండ్ అలానే డీటీహెచ్ విభాగంలోనూ తన సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తుంది. జియో ఆఫర్ చేయబోతున్న DTH సర్వీసులు అత్యంత చౌక ధరల్లో అందబాటులో ఉంటాయని సమచారం. రిలయన్స్ జియో DTH సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లయితే, మార్కెట్లో ఇప్పటికే DTH సేవలను ఆఫర్ చేస్తున్న ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ, టాటా స్కై, వీడియోకాన్ డీ2హెచ్ వంటి ఆపరేటర్లు తీవ్రమైన పోటీ మార్కెట్‌ను ఎదుర్కోవల్సి ఉంటుంది.

బ్రాడ్‌బ్యాండ్ సేవలు విభాగంలోకి జియో..

ఉచిత డేటా వాయిస్ కాల్స్‌తో టెల్కోలను ముప్పతిప్పలు పెట్టిన జియో బ్రాడ్‌బాండ్ రంగంలోకి దూసుకొస్తోంది. మొబైల్స్ లో అయితే ఏవిధంగా జియోను వినియోగదారులు వాడారో అదే వేగంతో జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 1000 జిబి డేటాతో జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రానున్నట్లు తెలుస్తోంది. నెలకు 100 జిబి మొదలుకుని 1000 జీబీ డేటా వరకు అందించే ప్లాన్‌ను జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ వర్గాల సమాచారం. 1 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 100 జీబీ వరకు ఉచిత డేటా మొదలుకొని 10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు గరిష్టంగా 1000 జీబీ వరకు డేటా ఇచ్చేలా జియో బ్రాడ్ బ్యాండ్ సేవలను తీసుకురానున్నట్టు సమాచారం.

రూ.1000కే 4జీ వోల్ట్ ఫోన్...

4G VoLTE  ఫోన్‌ల విభాగంలో రిలయన్స్ జియో సరికొత్త సంచలనానికి తెరలేపబోతున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో రూ.1000కే 4జీ వోల్ట్ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. 4G VoLTE టెక్నాలజీని ప్రతిఒక్కరికి చేరువచేసే క్రమంలో రిలయన్స్ ఇటువంటి నిర్ణయం తీసుకుందని స్పష్టమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio has made these things easier in India. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot