ఆప్టిమస్ బ్లాక్ స్మార్ట్‌పోన్‌ను భారత్‌లో విడుదల చేసిన ఎల్‌జి

Posted By: Staff

ఆప్టిమస్ బ్లాక్ స్మార్ట్‌పోన్‌ను భారత్‌లో విడుదల చేసిన ఎల్‌జి

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ "ఆప్టిమస్ బ్లాక్"ను ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఎల్‌జి భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యంత తేలికగా, నాలుగు అంగుళాల తాకే తెర (టచ్ స్క్రీన్) కలిగిన ఈ ఆప్టిమస్ అనేకు ఆధునిక ఫీచర్లతో లభిస్తోంది. ఎల్‌జి ఆప్టిమస్ వేరియంట్లో అందిస్తున్న అన్ని ఆండ్రాయిడ్ మోడళ్లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలాగే, ఆప్టిమస్‌లో కొత్తగా వచ్చిన 'ఆప్టిమస్ బ్లాక్' కూడా మార్కెట్లో మంచి ఆదరణ లభించగలదని కంపెనీ భావిస్తోంది. ఆప్టిమస్ బ్లాక్ స్మార్ట్‌ఫోన్ బరువు కేవలం 109 గ్రాములు మాత్రమే.

ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో (Android 2.2 FroYo) ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా ఆప్టిమస్ బ్లాక్ పనిచేస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ (Android 2.3 Gingerbread) ఆపరేటింగ్ సిస్టమ్‌కు దీన్ని అప్‌గ్రేడ్ చేయవచ్చని అంచనా. ప్రత్యేకించి యువతను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మొబైల్‌ను అందులోని ఫీచర్లను తీర్చిదిద్దింది. నాలుగు అంగుళాల నోవా డిస్‌ప్లే, డ్యూయెల్ కెమరా (ఫోన్ వెనుక వైపు 5 మెగా పిక్సెల్ కెమరా , ముందు 2 మెగా పిక్సెల్ కెమరా)లతో ఇది లభిస్తుంది. ప్రపంచంలోనే ఇది అత్యంత కాంతివంతమైన ఫోన్ అని ఎల్‌జి ఓ ప్రకటనలో తెలిపింది.

ఇంకా ఇది 1 గిగాహెట్జ్ కోర్టెక్స్ ఏ8 ప్రాసెసర్ (1GHz Cortex A8 processor)తో పనిచేస్తుంది. 2జీబి అంతర్గత (ఇంటర్నల్) మెమరీతో లభించే ఆప్టిమస్ బ్లాక్ మెమరీ సామర్థ్యాన్ని మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా 32జిబి పెంచుకోవచ్చు. ఎడ్జ్ (EDGE), జిపిఆర్ఎస్ (GPRS), 3జి హెచ్ఎస్‌యూపిఏ 5.76 ఎమ్‌బిపిఎస్ (3G HSUPA 5.76 Mbps), వై-ఫై హాట్‌స్పాట్ (WiFi Hotspot feature), 512ర్యామ్ (RAM) వంటి ఫీచర్లు ఎల్‌జి ఆప్టిమస్ సొంతం. ఇక మార్కెట్లో దీని ధర రూ. 19,990గా ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting