మైక్రోమ్యాక్స్ పవర్‌పుల్ స్మార్ట్ ఫోన్..

By Super
|
Micromax Andro A60


సెల్‌ వినియోగదారులకు రోజుకో సరికొత్త మోడల్‌ మొబైల్‌ అందుబాటులోకి వస్తోంది. వెరైటీ ఫీచర్స్‌తో ఆకట్టుకునే రూపాల్లో లభ్యమవుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మొబైల్ కంపెనీలు వీటిని రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో మైక్రోమాక్స్‌ తాజాగా కొత్త ఆకర్షణీయమైన ధరల్లో మార్కెట్లోకి 'మైక్రోమ్యాక్స్ ఆండ్రో ఎ 60' ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొబైల్‌ని విడుదల చేయనుంది

'మైక్రోమ్యాక్స్ ఆండ్రో ఎ 60' మొబైల్ ధర ఇండియన్ మార్కెట్లో సుమారు రూ 6,999 వరకు ఉండవచ్చునని అంచనా. మొదటి సారి ఎవరైతే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తారో ఈ సవరించిన ధరలు ఆకర్షిస్తాయని మైక్రోమాక్స్‌ చెబుతోంది. తొలిసారిగా వినియోగించేవారికి 600ఎంహెచ్‌జడ్‌ ప్రాసెసర్లు, వైఫై సపోర్ట్‌, 3జీ సపోర్ట్‌ వంటివాటిని అందించే మైక్రోమాక్స్‌ ఆండ్రాయిడ్‌ ఉత్పత్తులు కస్టమర్స్‌కి కొత్త అనుభూతిని అందిస్తాయని మైక్రోమ్యాక్స్ ప్రతినిధులు పేర్కోన్నారు.

'మైక్రోమ్యాక్స్ ఆండ్రో ఎ 60' మొబైల్ ప్రత్యేకతలు:

* 2.8-inch resistive full touch screen

* 3.2 MP camera Auto Focus

* Android 2.1 Eclair OS

* 600MHz microprocessor

* WiFi

* GPS

* Bluetooth

* FM radio

* Weight 105gms

* Measures 106.8mm x 59.2mm x 14.0mm

* 150MB internal memory

* Support micro SD upto 32 GB

* 1280 mAh Li-ion Battery

మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 2.8 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఆటో ఫోకస్ కెమెరా ప్రత్యేకత. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 150MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పై లను కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 600MHz మైక్రో ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1280 mAh Li-ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X