కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

|

ఇప్పుడు ప్రపంచమంతా సెల్ఫీల మయం అయిపోయింది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ సెల్ఫీ మోజులో మునిగితేలుతున్నారు. అదిరిపోయే సెల్ఫీలు దిగడం వాటిని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సర్వ సాధారణమైపోయింది. రానున్న రెండు సంవత్సరాల్లో సెల్ఫీలు ఓ కొత్త ట్రెండ్ సృష్టించే అవకాశం ఉందని మార్కెట్లో ఇప్పటినుంచే ఊహగానాలు మొదలయ్యాయి. సెల్ఫీ రంగంలో కొత్త టెక్నాలజీ పురుడుపోసుకోనుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు Instagram, Snapchatలలోనే కాకుండా Facebookలో కూడా ఇవి ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. Facebookలో చాలామంది ఈ సెల్పీలనే తమ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుంటున్నారు. అయితే ఇందుకోసం బెస్ట్ సెల్పీ కెమెరా ఫోన్ అవసరం ఎంతైనా ఉంది. లైటింగ్ దగ్గర నుంచి అన్ని రకాల అడ్జెస్ట్ మెంటతో అద్భుతమైన ఫోన్ మార్కెట్లో ఏదైనా దొరుకుతుందేమోనని చాలామంది ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ ప్రియులు ఓ సారి ఒప్పో కొత్త ఫోన్ మీద లుక్కేయండి.

 

హానర్ 9 లైట్‌లో దుమ్మురేపుతున్న రైడ్ ఫీచర్, బడ్జెట్ ధరకే సొంతంహానర్ 9 లైట్‌లో దుమ్మురేపుతున్న రైడ్ ఫీచర్, బడ్జెట్ ధరకే సొంతం

మరచిపోలేని సెల్ఫీలు తీయాలంటే

మరచిపోలేని సెల్ఫీలు తీయాలంటే

ఒప్పో అంటే సెల్ఫీ కెమెరాలకు పెట్టింది పేరు. ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఫోన్ సెల్పీలో మంచి పనితీరును కనబరిచే విధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒప్పో నుంచి OPPO F7 పేరుతో ఒ కొత్త సెల్ఫీ ఫోన్ మార్కెట్లోకి దూసుకురానుంది. 25 ఎంపీ Artificial Intelligence Front Cameraతో రానున్న ఈ ఫోన్ మీ సెల్ఫీలను అత్యంత ఆకర్షణీయంగా తీయనుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఫస్ట్ హెచ్ డిఆర్ టెక్నాలజీతో రానున్న ఫోన్ కూడా ఇదే. బ్యూటీ మోడ్ తో పాటు ఇంతకుముందు చూడని సరికొత్త ఫీచర్లను జోడించుకుని ఇది మార్కెట్లోకి రానుంది.

 సెల్ఫీ టెక్నాలజీ మీద ఒప్పో పట్టు

సెల్ఫీ టెక్నాలజీ మీద ఒప్పో పట్టు

ఒప్పో కంపెనీ కేవలం సెల్ఫీ టెక్నాలజీ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టింది. యూజర్లకు సెల్ఫీ సెగ్మెంట్లో ఏం కావాలో తెలుసుకుని వాటన్నింటినీ తమ ఫోన్లలో ప్రవేశపెట్టేందుకు తగు వ్యూహాలను రచిస్తోంది. హార్డ్ వేర్ , సాఫ్ట్ వేర్ లకు ప్రముఖ ప్రాధాన్యతనిస్తూ కంపెనీ మిగతా ఫోన్లకు సవాల్ నిస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ ఒప్పో ఎఫ్7 పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్న ఫోన్లో అనేక కొత్త విషయాలను తీసుకురానుంది.

Artificial Intelligence
 

Artificial Intelligence

ఒప్పోనుంచి త్వరలో రానున్న ఈ ఫోన్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.కాగా ఈ రకమైన టెక్నాలజీతో మార్కెట్లో దూసుకుపోతున్నది ఒప్పో మాత్రమే. అన్ని కంపెనీలకు సెల్ఫీ మార్కెట్లో గట్టి పోటీనిస్తూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ అయింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన OPPO F5, OPPO A83లు A.I Beauty Technologyతో సెల్ఫీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

OPPO F7లో ఆకట్టుకునేవి ఏంటి..?

OPPO F7లో ఆకట్టుకునేవి ఏంటి..?

రానున్న ఈ ఫోన్లో ఏఐ టెక్నాలజీనే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 25MP high-end cameraతో రానున్న ఈ ఫోన్ బ్యూటీ మోడ్ అప్ గ్రేడ్ వర్షన్ తో పూర్వం కన్నా బెటర్ ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. ఫోన్ లోని ప్రతీ ఫీచర్ వినియోగదారులను కట్టిపడేసేలా ఉండబోతున్నాయని కంపెనీ చెబుతోంది. మొత్తం మీద ఒప్పో నుంచి త్వరలో రానున్న ఈ ఫోన్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేలా సెల్ఫీ రంగంలో సరికొత్త మార్పులను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ మార్పులు ఏంటనేది వచ్చేవరకు చూడాల్సిందే.

Best Mobiles in India

English summary
OPPO F7 with the new AI powered camera will set new benchmarks in selfie segment More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X