తక్కువ ధరకే కత్తిలాంటి ఫోన్లు

Written By:

దేశీయ దిగ్గజం పానాసోనిక్ కత్తిలాంటి స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీలో దూసుకుపోతున్న పానాసోనిక్ మొబైల్ మార్కెట్ లో కూడా సత్తా చాటే లక్ష్యంతో రెండు స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఎలుగ ఎక్స్‌ రే మాక్స్‌ , ఎలుగ రే ఎక్స్‌పేర్లతో వీటిని లాంచ్‌ చేసింది. వీటి ధరలను వరుసగా రూ. 11,499 రూ. 8,999 గా నిర్ణయించింది. ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్ గా అమ్మడవుతాయని కంపెనీ తెలిపింది.

ఐఫోన్ల డేటా హ్యాకర్ల చేతికి వెళ్లింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్ నిఘా ఆధారిత ఫీచర్‌

స్మార్ట్ నిఘా ఆధారిత ఫీచర్‌ అర్బో తో ఇంటిలిజెంట్‌ ఈ స్మార్ట్‌‌ఫోన్లను పానాసోనిక్ లాంచ్ చేసింది. దీనికి సంబంధించి అర్బో ఈజ్‌ హియర్‌ తో మీడియాకు ఆహ్వానాలను పంపింది.

మాక్స్‌ ఫీచర్ల విషయానికొస్తే

ఎలుగ ఎక్స్‌ రే మాక్స్‌ ఫీచర్ల విషయానికొస్తే 5.20 అంగుళాల డిస్‌ప్లే తో పాటు 1080x1920 రిజల్యూషన్‌ కలిగి ఉంది. 1.4గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ మీద ఆపరేట్ అవుతంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో ఫోటోలు తీయవచ్చు. సెల్ఫీ షూటర్ల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను పొందుపరిచారు.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌,మైక్రో ఎస్ డీ ద్వారా విస్తరణ సామర్ధ్యం. 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ.

ఎలుగ రే ఎక్స్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే

ఎలుగ రే ఎక్స్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే 5.50 అంగుళాల డిస్‌ప్లేతో పాటు 720x1280 రిజల్యూషన్‌ కలిగి ఉంది.

4000ఎంఏహెచ్‌ బ్యాటరీ

1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 6.0, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ, 13 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా,3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Panasonic Launches Eluga Ray Smartphones in India Starting From Rs. 8,999 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot