ఈ రోజు Realme కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర, సేల్ తేదీ & ఆఫర్లు చూడండి!

By Maheswara
|

Realme అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Realme 10 4G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Helio G99SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇది 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.

 
ఈ రోజు Realme కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర, సేల్ తేదీ & ఆఫర్లు చూడండి!

అవును, Realme కంపెనీ భారతదేశంలో కొత్త Realme 10 4G స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పంచ్-హోల్ అమోలెడ్ డిస్‌ప్లేతో స్క్రీన్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది దాని వెనుక కెమెరాను ఉపయోగించి 1080p వీడియోలను తీయగలదని తెలుస్తోంది. ఇంకా, ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రత్యేకత ఏమిటి? దీని ధర ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Realme 10 4G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఈ Realme 10 4G స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే కూడా ఫ్లాట్ స్క్రీన్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది మరియు ఇది అమోలెడ్ డిస్‌ప్లే తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కూడా పొందుతుంది. ఇది, ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో G99SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 OS మద్దతుతో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది.ఇది కాక, ఇంకా 8GB వరకు వర్చువల్ ర్యామ్‌ ను కూడా పెంచుకోవచ్చు.

ఈ రోజు Realme కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర, సేల్ తేదీ & ఆఫర్లు చూడండి!

Realme 10 4G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరాలో 50-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. రెండవ కెమెరా 2-మెగాపిక్సెల్ B&W లెన్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ వెనుక కెమెరా 1080p వీడియోలను షూట్ చేయగలదు. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 33W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఇది ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి USB టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఆడియో కోసం 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 5 మరియు బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉన్నాయి.

ఈ రోజు Realme కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర, సేల్ తేదీ & ఆఫర్లు చూడండి!

ధర మరియు సేల్ వివరాలు

Realme 10 4G స్మార్ట్‌ఫోన్ యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర భారతదేశంలో రూ.13,999. ధర ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. కానీ మీరు లాంచ్ ఆఫర్‌లో బేస్ మోడల్‌ను కొనుగోలు చేస్తే, దాని ధర పై రూ.1,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ ను పొందవచ్చు. నలుపు మరియు తెలుపు కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఇది ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా స్టోర్ మరియు దేశంలోని ఇతర అధికారిక ఆఫ్‌లైన్ స్టోర్‌లలో జనవరి 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ చేయబడుతుంది.

 

ఇంకా, Realme తన రెండు స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Realme UI 4.0 ని విడుదల చేయడం కూడా ప్రారంభించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ పోస్ట్ ద్వారా కంపెనీ ప్రకటించినట్లుగా తెలిసింది. సమాచారం ప్రకారం, Realme GT Neo 3T మరియు Realme Narzo 50 Pro ఫోన్ల కోసం ఈ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ అందుబాటులో ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Realme 10 4G Smartphone Launched In India With 5000mAh Battery, Price And Sale Details Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X