గెలాక్సీ నోట్ 7 పేళుళ్లకు కారణం దొరికింది

Written By:

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేళుళ్లకు కారణాన్ని కనుగొన్నది. సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు గెలాక్సీ నోట్ 7 పేలుడుకు గల మూల కారణాలను తాము కనుగొన్నామని శాంసంగ్ రిపోర్ట్ చేసింది. తాము కనుగొన్న కారణాల రిపోర్ట్ ను టెస్టింగ్ ల్యాబోరేటరీకి అలాగే ఇతర రెగ్యులేటరీ సంస్థలకు పంపినట్లు శాంసంగ్ తెలిపింది. అయితే ఈ వివరాలను వినియోగదారులకు ఇంకా చెప్పలేదు.
అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ మధ్య వన్‌ప్లస్ 3 వార్, తల బాదుకుంటున్న వన్‌ప్లస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ నోట్ 7

గెలాక్సీ నోట్ 7 పేలుళ్ల కారణాలను కనుగొన్నామని, వాటిని రెగ్యులేటరీకి సమర్పించామని వీటిని ఇంకా ప్రజలకు తెలపలేదని దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ పేర్కొంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫోన్లలన్నింటినీ రీకాల్

కాగా గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో శాంసంగ్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్ 7 ఫోన్లలన్నింటినీ రీకాల్ చేసి సమస్యను పునరుద్ధరించుకుని మళ్లీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అవి కూడా పేలుతున్నాయనే వార్తలతో కంపెనీ ఆఫోన్లను పూర్తిగా బంద్ చేసింది.

సంస్థను పేలుళ్ల సమస్య

అయినప్పటికీ ఆ సంస్థను పేలుళ్ల సమస్య వెన్నాడుతూనే ఉంది. దీంతో తమ ఫోన్లను వెనక్కిచేయలంటూ కంపెనీ ప్రకటించింది. పేలుళ్లకు అసలు మూల కారణాలేమిటో తెలుసుకోవడం కోసం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను కంపెనీ నియమించింది.

అంతర్గత విచారణ పూర్తయిందని

ప్రస్తుతం అంతర్గత విచారణ పూర్తయిందని, ఈ రిపోర్టులను బయట ల్యాబోరేటరీలకు పంపించామని శాంసంగ్ వెల్లడించింది.

గెలాక్సీ 8 ను

ఇక పేలుళ్ల సమస్య కనుగొనే వరకు గెలాక్సీ 8 ను కూడా విడుదల చేయమని కంపెనీ జాప్యం చేస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ఫిబ్రవరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note 7 Explosion Investigation Completed, Findings Submitted to Regulators: Report
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot