మార్కెట్లోకి సామ్‌సంగ్ బ్యాటరీలు!

By Super
|
Samsung Galaxy S3 Spare 2,100 mAh Battery Now Available in India

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి విడుదలై అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘గెలాక్సీ ఎస్3’(Galaxy S3) ఇప్పుడు మరింత శక్తివంతం కాబోతుంది. ఈ మెగా ఫోన్‌కు సంబంధించి స్పేర్ బ్యాటరీని రిటైల్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు

సామ్‌సంగ్ వర్గాలు ప్రకటించాయి. 2,100ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల ఈ బ్యాటరీ 3జీ నెట్‌వర్క్ పై 11 గంటల టాక్‌టైమ్‌తో పాటు 790 గంటల స్టాండ్‌బై టైమ్‌ను సమకూరుస్తుంది. 2జీ నెట్‌వర్క్ పై 21 గంటల టాక్‌టైమ్‌తో పాటు 900 గంటల స్టాండ్‌బైని అందిస్తుంది. ధర రూ.1599. ఇటీవల ‘గెలాక్సీ ఎస్3’ ప్రపంచవ్యాప్త అమ్మకాల సంఖ్యను సామ్‌సంగ్ బహిర్గతం చేసింది. మేలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ 3 నెలల వ్యవధిలోనే 20 మిలియన్ యూనిట్లను క్రాస్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Read in English:

గెలాక్సీ ఎస్3 స్పెసిఫికేషన్‌లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X