సామ్‌సంగ్ కొత్త స్కీమ్.. ‘నెలసరి వాయిదాల పై ఫోన్‌ల అమ్మకాలు’

Posted By:

మార్కెట్లో తన స్థానాన్ని మరింత పదిలపరుచుకునే క్రమంలో సామ్‌సంగ్ సరికొత్త పథకాలతో ముందుకొచ్చింది. ఎంపిక చేసిన పలు ఫోన్ మోడళ్లను నెలసరి వాయిదా చెల్లింపు పై విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఈఎమ్ఐ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సామ్‌సంగ్ ఇండియాఈస్టోర్ అధికారిక వెబ్‌సైట్‌లో వెలవరించటం జరిగింది. లింక్ అడ్రస్:

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

ఈ 12 నెలల వాయిదా చెల్లింపు స్కీమ్, గెలాక్సీ నోట్2, గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్, గెలాక్సీ నోట్800, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ కెమెరా మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆకర్షణీయ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో నెల రోజుల పాటు డిజిటల్ మీడియా ఇంకా రిటైల్ స్టోర్‌లతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సామ్‌సంగ్ ఇండియా వెల్లడించిది.

సామ్‌సంగ్ కొత్త స్కీమ్.. ‘నెలసరి వాయిదాల పై ఫోన్‌ల అమ్మకాలు’

సామ్‌సంగ్ కోవలోనే యాపిల్ ఇటీవల ఐఫోన్5 కొనుగోలు పై రూ.16,990 డౌన్ పేమెంట్‌తో కూడిన 12 నెలల ఈఎమ్ఐ స్కీమ్ పాలసీని ప్రవేశపెట్టింది. సామ్‌సంగ్ 12 నెలల ఈఎమ్ఐ స్కీమ్ హైదారాబాద్‌లో అందుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రచురించటం జరుగుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting