ఈ ఫోన్ ఖరీదు రూ.3,990, ఫీచర్లు వింటే ఆశ్చర్యపోతారు

|

Seniorworld కంపెనీ సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తూ ఓ సరికొత్త మొబైల్ ని లాంచ్ చేసింది. 'ఈజీ ఫోన్‌ గ్రాండ్‌' పేరుతో ఒక ఫీచర్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కేవలం బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ ని పెద్దల కోసం కంపెనీ లాంచ్ చేసింది. కాగా ఈ ఫోన్ లాంచ్ ద్వారా కంపెనీ ఫీచర్ ఫోన్లన్నీ కేవలం యూత్‌కోసమే కాదు...సీనియర్ సిటిజన్ల కోసం కూడా అన్న సందేశాన్నిస్తోంది. వారు సౌలభ్యంగా వినియోగించుకునేందుకు వీలుగా చాలా 'ఈజీ'గా రూపొందించామని కంపెనీ చెప్పింది. భారత దేశంలో ఈ తరహా ఫోన్‌ లాంచ్‌ చేయడం ఇదే మొదటిసారని కంపెనీ చెబుతోంది. మరి ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

 

168 రోజులు అపరిమితం, Airtel మళ్లీ దుమ్మురేపింది168 రోజులు అపరిమితం, Airtel మళ్లీ దుమ్మురేపింది

వినికిడి సమస‍్య ఉన్న వారు

వినికిడి సమస‍్య ఉన్న వారు

వినికిడి సమస‍్య ఉన్న వారు, హియరింగ్‌ సాధనాలు పెట్టుకోవడానికి ఇష్టపడని వారికి తమ ఫోన్‌ మంచి పరిష్కారమని,స్పెషల్‌ టెక్నాలజీ, స్పెషల్‌ ఇయర్‌ఫోన్స్‌ ఈ డివైస్‌ ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది.

 అన్ని రకాల ఫీచర్లతో

అన్ని రకాల ఫీచర్లతో

సీనియర్లకు అవసరమయ్యే అన్ని రకాల ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందించామని చెప్పింది. పెద్ద స్క్రీన్ , పెద్ద ఫాంట్ సైజ్, డయలింగ్ కీలు కూడా పెద్దవిగా, ఫోటో డయిల్, క్రాడిల్ చార్జర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

సీనియర్ వరల్డ్.కామ్

సీనియర్ వరల్డ్.కామ్

సీనియర్ వరల్డ్.కామ్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియా లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. కేవలం రూ. 3,990కే ఈ ఈజీఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు
 

ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు

నాలుగు ఆటోమేటెడ్ పనులను నిర్వహించేలా ఎస్ఓఎస్ బటన్‌తో పాటు ఇంకా ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు, వాటికి కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం, ఇన్ కామింగ్ కాల్స్ లిస్ట్, కస్టమైసెబుల్ మెనూ ఫీచర్లను ఆటోమేటెడ్‌గా ఈ ఫోన్‌లో పొందుపరిచామని పేర్కొంది.

 ప్రత్యేక అవసరాలకు

ప్రత్యేక అవసరాలకు

సీనియర్‌ సిటిజనుల ప్రత్యేక అవసరాలకు, కచ్చితంగా ఈ ఫోను ఉపయోగపడుతుందనే విశ్వాసాన్ని కంపెనీ సీఈవో రాహుల్ గుప్తా వ్యక్తం చేశారు.

Best Mobiles in India

English summary
Seniorworld launches easyfone Grand for senior citizens, priced at Rs 3,990 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X