సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

Posted By:

బెర్లిన్ నగరంలో జరుగుతోన్న ఐఎఫ్ఏ 2015 టెక్నాలజీ ఉత్పత్తుల ప్రదర్శనలో భాగంగా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ తన ఎక్స్‌పీరియా జెడ్5 సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటి వివరాలు.. ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్, ఎక్స్‌‌పీరియా జెడ్5 , ఎక్స్‌పీరియా జెడ్5 కాంపాక్ట్.

Read More : విరుచుకుపడుతోన్న సునామీ

ఎక్స్‌పీరియా జెడ్5, ఎక్స్‌పీరియా జెడ్5 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఆక్టోబర్ 2015 నుంచి ప్రముఖ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ నవంబర్ 2015 నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో లభ్యమవుతుంది. ఈ మూడు ఫోన్‌లు సింగిల్ ఇంకా డ్యుయల్ సిమ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్ (ఐపీ 65/68) ప్రూఫింగ్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లు పవర్ బటన్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంటడం ఓ ప్రత్యేకమైన అంశం. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సౌలభ్యత ఫోన్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ ప్రత్యేకతలు:ఎక్స్‌పీరియా జెడ్5 ప్రీమియమ్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల 4కే ట్రైల్యుమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 3840 x 2160పిక్సల్స్, 806 పీపీఐ), డిస్‌ప్లే క్వాలిటీని మరింతగా పెంచేలా ఎక్స్ రియాల్టీ ఇంజిన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

64 బిట్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టవిటీ, డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, క్వాల్కమ్ క్విక్‌చార్జ్ 2.0 టెక్నాలజీతో కూడిన 3430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఎక్స్‌పీరియా జెడ్5 క్రోమ్, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్ లలో నవంబర్ నుంచి అందుబాటులో ఉంటుంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

ఎక్స్‌పీరియా జెడ్5 కాంపాక్ట్ ప్రత్యేకతలు:

4.6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ఎంఎస్ఎమ్8994 చిప్‌సెట్, ఆక్టా‌కోర్ 1900 మెగాహెర్ట్జ్ ప్రాసెసర్(ఆర్మ్ కార్టెక్స్ - ఏ57, ఆర్మ్ కార్టెక్స్ - ఏ53, 64 బిట్),

ఎక్స్‌పీరియా జెడ్5 కాంపాక్ట్

ఎక్స్‌పీరియా జెడ్5 కాంపాక్ట్ ప్రత్యేకతలు:

2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టవిటీ, డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, 2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

ఎక్స్‌పీరియా జెడ్5 ప్రత్యేకతలు

5.2 అంగుళాల ట్రైల్యుమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

3 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

4జీ ఎల్టీఈ కనెక్టవిటీ, డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, క్వాల్కమ్ క్విక్ చార్జ్ 2.0 టెక్నాలజీతో కూడిన 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony launches Xperia Z5 family with New Featuers. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot