రూ.10,999కే బ్రాండెడ్ 4జీబి ర్యామ్ ఫోన్

స్వైప్ టెక్నాలజీస్ తన Elite సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Swipe Elite Max పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఊరించే ప్రయత్నం చేస్తోంది. రూ.10,999 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉంచిన ఈ ఫోన్‌ను, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ డిసెంబర్ 14 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

రూ.10,999కే బ్రాండెడ్ 4జీబి ర్యామ్ ఫోన్

Read More : రూ.5,000లో 4జీ ఫోన్‌లు ఇవే!

ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ 64 బిట్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

రూ.10,999కే బ్రాండెడ్ 4జీబి ర్యామ్ ఫోన్

Read More : సంచలన ఆఫర్లతో దూసుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ జిప్ ఛార్జ్ ఫీచర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్), స్టీరియో మాక్స్ స్పీకర్.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Swipe Elite Max with 5.5-inch Full HD display, 4GB RAM launched at Rs 10,999. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot