రూ. 7 వేలకు అదిరే 4జీ వోల్ట్ ఫోన్

Written By:

స్వైప్ కంపెనీ తన సరికొత్త ఫోన్ ఎలైట్ పవర్ ని ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. ఈ ఫోన్ హైలెట్ ఫీచర్ ఏంటంటే 4000mAh బ్యాటరీతో వస్తోంది. 4జీ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.6999గా నిర్ణయించింది. ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఒక్క క్లిక్‌తో మీరు వాడని పాత అకౌంట్లను డిలీట్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ హెచ్ డి ఐపీఎస్ డిస్‌ప్లేతో మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. రిజల్యూషన్ విషయానికొస్తే 720x1280 pixels. ఆండ్రాయిడ్ 6.0 మార్షమల్లో మీద రన్ అవుతుంది.1.1GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 210 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 2జిబి ర్యామ్ అలాగే 16 జిబి ఇన్ బుల్ట్ స్టోరేజి మైక్రోఎస్ డీ ద్వారా 32 జిబి వరకు విసర్తించుకునే అవకాశం ఉంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 8 మెగా ఫిక్సల్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ తో క్వాలిటీ ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 5 ఎంపీ సెల్ఫీ షూటర్ ఉంది.

ఫింగర్ ప్రింట్ సెన్సార్

హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ ను సపోర్ట్ చేస్తుంది. మైక్రో సిమ్ అలాగే నానో సిమ్ వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ ప్యానల్ లో ఉంటుంది. స్పేస్ గ్రే కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది.

కనెక్ట్ గ్రాండ్ ఫోన్

స్వైప్ టెలికాం ఈ మధ్య కనెక్ట్ గ్రాండ్ ఫోన్ ని రూ. 2,799 కే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో మీద రన్ అయ్యే ఈ ఫోన్ షాప్ క్లూస్ ద్వారా లభిస్తుంది. బ్లాక్ కలర్ లో మాత్రమే ఫోన్ లభ్యమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Swipe Elite Power With 4000mAh Battery, 4G VoLTE Support Launched Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot