మీరు కలలో కూడా టచ్ చేయలేని ఫోన్లు !

Written By:

కొన్ని ఫోన్లు సామాన్యులు ఇప్పటిదాకా రియల్‌గా చూడలేదంటే ఎవరైనా నమ్ముతారా.. వాటిని కేవలం ధనవంతులు మాత్రమే చూడగలుగుతారంటే మీరు నమ్ముతారా...నిజమే నమ్మాలి. కొన్ని ఫోన్లు సామాన్యులకు అందని ద్రాక్షగానే ఉంటాయి. అవి కొనాలంటే సామాన్యుడికి శక్తి సరిపోదు. ఇక్కడ కొన్ని ఫోన్లను ఇస్తున్నాం కావాలంటే మీరే చూడండి. ఆఫోన్లు మీరు ఎప్పుడైనా టచ్ చేశారేమో..

గూగుల్‌లో ఈ ఏడాది అందరూ తెగ వెతికిన ఫోన్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Vertu Signature Diamond

దీని ధర 88,300 డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే 5 కోట్ల 98 లక్షల 36 వేల 929 రూపాయలు ఉంటుంది. మరి ఆ రేంజ్ ఫోన్ అంటే ఫీచర్లు ఏ స్థాయిలో ఉంటాయో అని ఊహించుకోవచ్చు. ఇది ఓన్లీ లుక్ కోసం మాత్రమే. దీనిలో ఎటువంటి ఫీచర్లు లేవు. డైమండ్ కలర్ తో చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉంటుందని ధనవంతులు దీన్ని వాడుతారట. కంపెనీ కూడా కేవలం 200 ఫోన్లను మాత్రమే రీలీజ్ చేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే దీని తయారీలో ఎటువంటి మిషన్ వాడలేదు కేవలం చేత్తోనే తయారుచేశారు. మొత్తం డైమండ్స్ తో నిండి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

iPhone Princess Plus

దీని ధర 176400 డాలర్లు. మన కరెన్సీలో రూ. 11,95,4,178.18. ఆపిల్ నుంచి వచ్చిన ఈ ఫోన్లో 180 డైమండ్లు 138 వజ్రాలతో నింపారు. ఆపిల్ నుంచి వచ్చిన అత్యంత కాస్ట్లీ ఫోన్ ఇదే.

Black Diamond VIPN Smartphone

దీని ధర 300,000 డాలర్లు. సోనీ ఎరిక్సన్ కంపెనీ తయారుచేసింది. ఈ ఫోన్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆపరేటింగ్ చేసే రెండు బటన్లు డైమండ్ తోనే తయారుచేశారు. అత్యంత సెక్యూరిటీ కలిగిన ఫోన్ ఇదే.

Vertu Signature Cobra

దీని ధర 310,000 డాలర్లు. ఇది చూసేందుకు పాములాగా ఉంటుంది. మొత్తం డైమండ్లతో పొదిగారు. ధనవంతులు పెద్ద పెద్ద మీటింగ్ లో దర్పం కోసం దీన్ని వాడుతారట.

Gresso Luxor Las Vegas Jackpot

దీని ధర 1 మిలియన్ డాలర్లు. ఇది 200 సంవత్సరాల క్రితం నాటి ఆఫ్రికన్ ఉడ్ తో తయారుచేశారు. ఈ ఫోన్ అంతా డైమండ్లతో నిండి ఉంటుంది. అంతే కాకుండా కీ బోర్డ్ చాలా అందంగా కూడా ఉంటుంది. ఇతర ఫోన్లకు ధీటుగా ఫీచర్లు కూడా ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Most Expensive Mobile Phones in the World 2016 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot