వివో వీ5 ప్లస్ మార్కెట్లో సత్తా చాటుతుందా..?

Written By:

ఇప్పటివరకు వెనుకవైపు రెండు కెమెరాలతో వినియోగదారులను ఆకట్టుకున్న వివో కంపెనీ, సెల్ఫీలకు పెరిగిన ఆదరణతో రెండు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాల ఫోన్ రూపొందించింది. 'వీ5 ప్లస్' పేరుతో రూపొందిన ఈ ఫోన్‌ను ఎట్టకేలకు భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.27,980గా నిర్ణయించింది. 4జీబి ర్యామ్‌తో వచ్చిన ఈ ఫోన్ 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ని కలిగి ఉంది.

4జిబి ర్యామ్‌తో మోటో జీ5 ప్లస్ వస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

వివో వీ 5 ప్లస్ 5.5 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో 1080 పిక్సల్ తో వచ్చింది. 2.5 కర్వ్డ్ గ్లాస్ తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అదనపు ఆకర్షణగా నిలవనుంది.

ర్యామ్

వివో వీ 5 ప్లస్ 4జిబి ర్యామ్ తో వచ్చింది. ఇంటర్నల్ స్టోరేజి విషయానికొస్తే 64 జిబి ఆన్ బోర్డ్ స్టోరేజి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ చిప్ సెట్ ని ఇందులో పొందుపరిచారు.

కెమెరా

కెమెరా విషయానికొస్తే డ్యూయెల్ సెల్పీ కెమెరాతో ఫోన్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఒకటి 8 ఎంపీ మరొకటి 20 ఎంపీ Sony IMX376 1/2.78-inch sensor సెల్పీ కెమెరాలు ఉంటాయి. బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంటుంది. 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు

బ్యాటరీ

ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే 3,160 mAh బ్యాటరీ. ఇది వివో డ్యూయెల్ ఛార్జింగ్ ఇంజిన్ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. దీని ద్వారా ఫోన్ ఫాస్ట్ గా ఛార్జింగ్ అయ్యే అవకాశం ఉంది.

అదనపు ఫీచర్లు

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో వంటివి అదనపు ఫీచర్లు. దీని అమ్మకాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. రేపటి నుంచి ఫ్రీ బుకింగ్ ఆర్డర్లు స్వీకరిస్తామని కంపెనీ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vivo V5 Plus with dual-selfie cameras launched in India, priced at Rs 27,980: Specifications, features read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot