షియోమీ క్రిస్మస్ డిస్కౌంట్స్

క్రిస్మస్, న్యూఇయర్ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ తన స్మార్ట్‌ఫోన్స్ అలానే యాక్సెసరీస్ పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. Mi Christmas sale పేరుతో ఈ బ్రాండ్ అనౌన్స్ చేసిన అన్ని ఆఫర్లు Mi.com/inలో డిసెంబర్ 21 వరకు అందుబాటులో ఉంటాయి.

Read More : ఫేస్‌బుక్‌లో గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు

 షియోమీ క్రిస్మస్ డిస్కౌంట్స్

ఈ సేలో భాగంగా రూ.22,999 విలువ చేసే Mi 5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.3000 తగ్గింపుతో రూ.19,999కే షియోమీ ఆఫర్ చేస్తోంది. ఇదే సమయంలో 20,000 mAh పవర్ బ్యాంక్‌ను రూ.600 తగ్గింపుతో రూ.1899కే సొంతం చేసుకోవచ్చు. 10,000 mAh పవర్ బ్యాంక్‌ను రూ.300 తగ్గింపుతో రూ.999కే సొంతం చేసుకోవచ్చు. Mi In-Ear హెడ్ ఫోన్స్ ను ప్రత్యేక తగ్గింపుతో రూ.1599కి షియోమీ విక్రయిస్తోంది.

Read More : రూ.350కే 1500 నిమిషాల టాక్‌టైమ్, 5జీబి డేటా

 షియోమీ క్రిస్మస్ డిస్కౌంట్స్

రెడ్మీ 3ఎస్ ప్రైమ్, రెడ్మీ నోట్ 3, రెడ్మీ 3ఎస్ ఫోన్‌లకు సంబంధించిన యాక్సెసరీస్ పై రూ.400 వరకు ప్రత్యేకమైన తగ్గింపును షియోమీ ఆఫర్ చేస్తోంది. రెడ్మీ 3ఎస్, 3ఎస్ ప్రైమ్, రెడ్మీ నోట్ 3, ఎంఐ మాక్స్, ఎంఐ 5 ఫోన్‌ల పై మూడు నెలల హంగామా ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను షియోమీ అందిస్తోంది. అయితే 10 లక్షల మందికి మాత్రమే ఈ సబ్‌స్ర్కిప్షన్ లభించే అవకాశం ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Grab Xiaomi Mi 5, Power Bank, and More at Attractive Discounts This Christmas. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot