అత్యంత తక్కువ ధరకే 6జిబి ర్యామ్ ఫోన్, కంపెనీ ఫస్ట్ ఫోన్ ఇదే !

By Hazarath
|

అనుకున్నట్లుగానే షియోమి సంచలనాలకు వేదికగా నిలిచింది. రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ పేర్లతో రెండు ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెడ్‌మి నోట్‌ 4 విజయవంతమైన నేపథ్యంలో దానికి మరికొన్ని ఫీచర్లను జత చేస్తూ రెడ్‌మి నోట్‌ 5ను విడుదల చేస్తున్నట్టు కంపెనీ ఇండియా హెడ్‌ మను కుమార్‌ జైన్‌ తెలిపారు. దీంతో పాటు కంపెనీ ఎంఐ టీవీ4ను కూడా లాంచ్ చేసింది. కాగా 6జిబి ర్యామ్‌తో వచ్చిన Redmi Note 5 Pro మార్కెట్లో అధికభాగాన్ని కొల్లగొట్టే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. హెలెట్స్ పై ఓ లుక్కేయండి.

 

ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ బెస్ట్ అనే దానికి కారణాలు !ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ బెస్ట్ అనే దానికి కారణాలు !

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర

ధర

స్నాప్‌డ్రాగన్‌625 ప్రాసెసర్‌ కింద బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ వేరియెంట్లలో రూ.9,999, రూ.11,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు
 

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర

ధర

బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,999, రూ.16,999 ధరలకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది. ఈ ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో ఎప్పటి నుంచి విక్రయిస్తారో షియోమీ వెల్లడించలేదు.

అన్నీ కుదిరితే..

అన్నీ కుదిరితే..

అన్నీ కుదిరితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు వచ్చే వారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌లలో ఫ్లాష్‌ సేల్‌కు రానున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆఫ్‌లైన్‌గా కూడా వీటిని అందుబాటులోకి తీసుకురానుంది.కాగా రెడ్‌మి నోట్‌ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి నోట్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం.

ఎంఐ టీవీ4..

ఎంఐ టీవీ4..

వీటితో పాటు తొలిసారి భారత్‌లో ఎంఐ టీవీ4ను కూడా కంపెనీ విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 కంటే పలుచగా ఈ ఎంఐ టీవీ ఉంది. ప్రపంచంలోనే అత్యంత పలుచైన ఎల్‌ఈడీ టీవీ ఇదేనని షియోమి తెలిపింది. దీని ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది.

5 లక్షల గంటల కంటెంట్‌..

5 లక్షల గంటల కంటెంట్‌..

హాట్‌స్టార్‌, వూట్‌, సోనీ లివ్‌, హంగామా ప్లే, జీ5, సన్‌ నెక్ట్స్‌, వియూ, టీవీఎఫ్‌, ఫ్లిక్‌స్ట్రీ వంటి వాటితో షియోమి భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. వీటి భాగస్వామ్యంతో 5 లక్షల గంటల కంటెంట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. దీనిలో 80 శాతం కంటెంంట్‌ను పూర్తిగా ఉచితమని తెలిపింది. ఎంఐ టీవీ 4 తోపాటు ఎంఐ టీవీ రిమోట్‌ను కూడా షియోమి తీసుకొచ్చింది. దీనిలో కేవలం 11 బటన్లు మాత్రమే ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Redmi Note 5, Redmi Note 5 Pro Launched in India at Starting Price of Rs. 9,999, Mi TV 4 Showcased: Event Highlights More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X