‘మార్షల్’ కొత్త ప్రయోగం..?

Posted By: Super

‘మార్షల్’ కొత్త ప్రయోగం..?

 

‘గత కొన్నాళ్లుగా మానిటర్లు, యాంప్లీఫయర్ల తయారీ రంగంలో రాణిస్తున్న ‘మార్షల్’ సంస్థ తాజాగా హెడ్‌పోన్ల మార్కెట్లోకి రంగప్రవేశం చేసింది. ప్రస్తుత మోడ్రెన్ ట్రెండ్‌లో ఫ్యాషనబుల్ వస్తువుగా గుర్తింపు తెచ్చుకున్న హెడ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.

తాజాగా మార్షల్ సంస్థ ‘మార్షల్ మేజర్ వైట్ హెడ్‌ఫోన్ల’ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అత్యాధునిక ‘రెట్రో’ (retro) డిజైన్‌తో ఈ గ్యాడ్జెట్‌ను రూపొందించారు. హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన ‘ఇయర్ కప్స్’ స్క్వేర్ ఆకృతిలో మౌల్డ్ చేశారు.

చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ‘ఇయర్ కప్’లను సున్నితమైన ఫీచర్లతో రూపొందించారు. మ్యూజిక్ లేదా కాల్‌ను రిసీవ్ చేసుకునే సందర్భంలో శ్రోత కంఫర్ట్ ఫీల్ అవుతాడు.

హెడ్‌ఫోన్లో ఏర్పాటు చేసిన 3.2mm ఆడియో జాక్ ఆధారితంగా మొబైల్ ఫోన్లు ఇతర మ్యూజిక్ ప్లేయర్లకు జత చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 20 hertz నుంచి 20,000hertz వరకు. మ్యాగ్జిమమ్ ఇన్‌పుట్ పవర్ 20 mW, 40 mm డ్రైవర్‌ను ఈ ఆడియో సిస్టంలో నిక్షిప్తం చేశారు.

ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్, రిమోట్ వ్యవస్థలు ఈ అత్యాధునిక హెడ్‌పోన్‌కు మరింత బలం చేకూరుస్తాయి. పొందుపరిచిన అత్యాధునిక సౌండ్ వ్యవస్థ శ్రోతకు అంతరాయంలేని ఆడియోను నిరంతరాయంగా అందిస్తుంది. భారతీయ మార్కెట్లో మార్షల్ మేజర్ వైట్ హెడ్ ఫోన్ ధర రూ.6,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot