మోటరోలా లేటెస్ట్ హెడ్‌ఫోన్స్..Moto Pulse M!

By: Madhavi Lagishetty

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మోటరోలా, Moto Pulse M పేరుతో సరికొత్త హెడ్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటి ధర రూ.2,999. వైట్, గోల్డ్, బ్లాక్ ఇంకా సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఈ హెడ్‌సెట్ అందుబాటులో ఉంటుంది.. 

మోటరోలా లేటెస్ట్  హెడ్‌ఫోన్స్..Moto Pulse M!

స్పోర్ట్ మెటాలిక్ ఫినిషింగ్‌తో వస్తోన్న మోటో పల్స్ ఎం హెడ్‌ఫోన్స్ స్టైలిష్‌ లుక్‌ను యూజర్లకు ఆఫర్ చేస్తాయి. కస్టమర్లకు వినూత్న అనుభూతులను అందించడంతో పాటు సంగీత ప్రపంచంతో కనెక్ట్ చేస్తాయి. హెడ్‌ఫోన్‌లోని ఇయర్ పాడ్స్ చెవులకు ఎంతో అనుకూలంగా మెత్తటి ఫీలింగ్‌ను అందిస్తాయి. అవసరంలేని సమయంలో ఈ హెడ్‌ఫోన్‌లకు సంబంధించి కనెక్టింగ్ వైర్లను తీసేసి నలగకుండా సెపరేట్‌గా స్టోర్ చేసుకునే అవకాశం ఉంది.

మోటరోలా లేటెస్ట్  హెడ్‌ఫోన్స్..Moto Pulse M!

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మోటో అందిస్తున్న పల్స్ ఎం హెడ్ ఫోన్స్ ఒక కొత్త అనుభూతిగా చెప్పుకోవచ్చు. వర్వ్ లూప్ స్పోర్ట్స్ పేరుతో ఈ మధ్యే మోటోరోల బ్లూటూత్ ఇన్ ఇయర్ హెడ్‌ఫోన్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ బ్లూటూత్‌కు ఐపీ 54 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ తోపాటు ఇంటర్నల్ బ్యాటరీ కూడా ఉంది. వైర్ అండ్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ మోటోరోల ఒకే ధరతో వినియోగదారులకు అందిస్తోంది.

Read more about:
English summary
Motorola has launched a pair of wired over-the-ear headphones in India, the Moto Pulse M, that retail at Rs. 2,999 and has a detachable audio cable.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot