ఒకే సారి. రెండు ఫోన్లతో.?

Posted By: Prashanth

ఒకే సారి. రెండు ఫోన్లతో.?

 

అంతర్జాతీయ మొబైల్ మార్కెట్లో సుస్తిర స్థానాన్ని కైవసం చేసుకున్న ‘నోకియా’ అదే హవాను కొనసాగిస్తూ ఆడియో పరికరాల మార్కెట్లో దూసుకుపోతుంది. తాజాగా ఈ దిగ్గజ బ్రాండ్ అత్యాధునిక ఆడ్వాన్సడ్ ఫీచర్లతో ‘నోకియా BH110’ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను డిజైన్ చేసింది. డివైజులో ఏర్పాటు చేసిన ‘ఆడ్వాన్సడ్ మల్టీ పాయింట్ టెక్నాలజీ’ రెండు మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే కాల్స్ సమాచారాన్ని మీకు చేరవేస్తుంది. ఉదాహరణకు: ‘నోకియా BH 110’ హెడ్‌సెట్‌ను ఒకేసారి రెండు మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ రెండు ఫోన్లు దూరంగా ఉన్నప్పటికి వాటి ద్వారా వచ్చే కాల్స్‌ను అనుసంధానించబడిన హెడ్‌సెట్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు.

క్లుప్తంగా ‘నోకియా BH110’ ఫీచర్లు:

* హెడ్‌సెట్ సైజు మరియు స్పెసిఫికేషన్ 56.0 x 17.4 x 8.7 mm, * బరువు 10 గ్రాములు, 2mm ఛార్జింగ్ కనెక్టర్, * బ్యాకప్ 6 గంటలు, * శక్తివంతమైన 9 mm డైనమిక్ స్పీకర్లను డివైజులో పొందుపరిచారు, * ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 300 Hz నుంచి 3400 Hz వరకు, * మల్టీ ఫంక్షన్ బటన్, * నలుపు, * తెలుపు రంగుల్లో ఈ హెడ్‌సెట్లు డిజైన్ కాబడ్డాయి, * ధర, * ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot