ఆడియో ఉత్పత్తుల రంగంలోకి సామ్‌సంగ్

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తాజాగా ఆడియో పరికరాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. తాము రూపకల్పన చేసిన సరికొత్త హెడ్‌ఫోన్‌లతో పాటు వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్‌ను రానున్న వారాల్లో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు సామ్‌సంగ్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లెవల్ (Level) బ్రాండ్ పేరుతో ఈ ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఆడియో ఉత్పత్తుల మార్కెట్ విడుదలకు సంబంధించి సామ్‌సంగ్ ఏ విధమైన వివరాలను వెలువరించలేదు. సామ్‌సంగ్ ప్రవేశపెట్టబోతున్న లెవల్ ఫ్యామిలీ నుంచి మొత్తంగా నాలుగు ఆడియో ఉత్పత్తులను సామ్‌సంగ్ ఆవిష్కరించనుంది. వాటి వివరాలను పరిశీలించిట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆడియో ఉత్పత్తుల రంగంలోకి సామ్‌సంగ్

లెవల్ ఓవర్ (Level Over):

ఈ టాప్ టైర్ మోడల్ హెడ్‌ఫోన్‌లో ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఈ హెడ్‌సెట్‌లను బ్లూటూత్ సాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన టచ్ కంట్రోల్స్‌ను హెడ్‌ఫోన్ పక్క భాగంలో ఏర్పాటు చేసారు.

 

ఆడియో ఉత్పత్తుల రంగంలోకి సామ్‌సంగ్

లెవల్ ఆన్ (Level On):

లెవల్ ఓవర్ హెడ్‌ఫోన్‌తో పోలిస్తే లెవన్ ఆన్ హెడ్‌ఫోన్ తక్కువ స్థాయి ఫీచర్లను కలిగి ఉంటుంది. కేబుల్ సాయంతో ఈ హెడ్‌ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంది. అలాగే నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ లేదు.

 

ఆడియో ఉత్పత్తుల రంగంలోకి సామ్‌సంగ్

లెవల్ ఇన్ (Level In):

లెవల్ ఇన్ పేరుతో డిజైన్ చేయబడని ప్రత్యేకమైన ఇయర్ బడ్స్ అత్యుత్తమ సౌండ్ క్వాలిటీని అందిస్తాయని సామ్‌సంగ్ వెల్లడించింది.

 

ఆడియో ఉత్పత్తుల రంగంలోకి సామ్‌సంగ్

లెవల్ బాక్స్ (Level Box):

ఈ పోర్టబుల్ స్పీకర్లను బ్లూటూత్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్ ఉన్నట్లయితే ఈ ఫీచర్ ద్వారా కూడా లెవల్ బాక్స్‌కు కనెక్ట్ కావచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot