వుయ్‌చాట్ ఊరిస్తోంది!

Posted By:

ఇంటర్నెట్ అత్యవసరమైన నేపధ్యంలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల వినియోగం రోజురోజుకు పెరగుతోంది. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన వాట్స్‌యాప్, వుయ్‌‍చాట్ వంటి సామాజిక సమాచార మాద్యమాలు పట్ల యువత అత్యధికంగా ఆకర్షితులవుతున్నారు. సరికొత్త చాటింగ్ ఫీచర్లతో వుయ్‌చాట్ మెసెంజర్ యాప్ ఆకట్టుకుంటోంది. ఈ యాప్‌లోని 10 స్పెషల్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..

Read More : అదిరే కెమెరా ఫోన్స్, జస్ట్ రూ.7,000కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గ్రూప్ మెసేజింగ్

గ్రూప్ మెసేజింగ్

వుయ్‌చాట్ గ్రూప్ మెసేజింగ్‌లో భాగంగా 40 మందిని వరకు యాడ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో కేవలం ఈ పరిధి 30 వరకు మాత్రమే ఉంది.

 

వీడియో కాల్

వీడియో కాల్

వుయ్‌చాట్ వీడియో కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

 

హోల్ట్ టు టాక్

హోల్ట్ టు టాక్

వుయ్‌‍చాట్‌లోని హోల్ట్ టు టాక్ బటన్‌‍ను ఉపయోగించుకుని మీ మెసేజ్‌ను రికార్డ్ చేసి పంపవచ్చు.

 

ఎమోటికాన్స్

ఎమోటికాన్స్

వుయ్‌చాట్‌లో మీకు నచ్చినట్లు ఎమోటికాన్స్‌ను సృష్టించుకుని వాటిని మీ మిత్రులతో షేర్ చేసుకోవచ్చు.

 

సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్

సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్

వుయ్‌చాట్ సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్‌ను మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ కూడా లింక్ చేయవచ్చు.

 

మూమెంట్స్

మూమెంట్స్

వుయ్‌చాట్‌‍లో మూమెంట్స్ పేరుతో ప్రత్యేకమైన పొదుపరిచారు. ఈ ఫీచర్ సహాయంతో మీ అద్భుతమైన క్షణాలను ప్రపంచంతో పంచుకోవచ్చు.

 

లుక్ అరౌండ్

లుక్ అరౌండ్

వుయ్‌చాట్‌లో పొందుపరిచిన లుక్ అరౌండ్ ఫీచర్ సహాయంతో మీ నెట్‌వర్క్ పరిధిని మరింతగా విస్తరించుకోవచ్చు.

 

డ్రిఫ్ట్ బాటిల్

డ్రిఫ్ట్ బాటిల్

వుయ్‌చాట్‌లోని డ్రిఫ్ట్ బాటిల్ పేరుతో ఓ ఫన్నీ ఫీచర్‌ను పొందుపరిచారు. ఈ ఫీచర్‌లో భాగంగా ఓ టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్‌ను బాటిల్‌లో వేసి సముద్రంలో విసిరేస్తారు. బాటిల్‌‌లోని మీ మెసెజ్‌ను ప్రపంచంలో ఎవరో ఒకరు చూస్తారు. నిజంగా అద్భుతం కదూ!

 

షేక్

షేక్

వుయ్‌చాట్‌లో పొందుపరిచిన మరో ఫన్నీ ఫీచర్ ‘షేక్'. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఫోన్ షేక్ చేయటం ద్వారా ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్‌ను నిర్వహించుకోవచ్చు.

 

వెబ్ వుయ్‌చాట్

వెబ్ వుయ్‌చాట్

వుయ్‌చాట్ యాప్‌ను మీ పీసీలో కూడా రన్ చేసుకోవచ్చు.

 

ఎప్పటికి ఉచితం

ఎప్పటికి ఉచితం

వుయ్‌చాట్ యాప్ ఎప్పటికి ఉచితమే.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Reasons Why WeChat is Better than Whatsapp. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot