రూ. 1 లక్షా 10 వేల ఐఫోన్ బుక్ చేస్తే ఆపిల్ డ్రింక్ వచ్చింది,బిత్తరపోయిన మహిళ

By Gizbot Bureau
|

మన దృష్టికి ప్రతిరోజూ ఆన్‌లైన్ మోసాల గురించి నిత్యం ఎన్నో సంఘటనలు వస్తుంటాయి, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో మొబైల్ ఆర్డర్ ఇస్తే సబ్బు బిల్లలు, అగ్గిడబ్బాలు, చాక్లెటు రావడం లాంటి వార్తలు మనం చాలా సార్లే వినే ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే చైనాలో మరొకటి చోటు చేసుకుంది. ఓ యువతి ఆన్‌లైన్‌లో ఆపిల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే ఆమెకు ఆపిల్ డ్రింక్ వచ్చింది. ఆ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

1500 డాలర్లుతో ఆర్డర్

1500 డాలర్లుతో ఆర్డర్

ఆ వివరాల్లోకి వెళ్తే.. తాజాగా మార్కెట్లో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ను కొనుగోలు చేసేందుకు చైనాలో   లీయూ (Liu) అనే చైనీస్ మహిళ ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ నుంచే ఆర్డర్ చేసింది. ఇందుకోసం ఆమె 1500 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు 1 లక్షా 10 వేల రూపాయలు) కంపెనీకి చెల్లించింది. ఇక అనుకున్న సమయానికే ఆమెకు తన ఆర్డర్ డెలివరీ చేయబడింది.

Also Read:సైనికులకు గిఫ్ట్ గా 'సోలార్ మిలిటరీ టెంట్'!! కొత్త ఆవిష్కరణతో చలికి చెక్Also Read:సైనికులకు గిఫ్ట్ గా 'సోలార్ మిలిటరీ టెంట్'!! కొత్త ఆవిష్కరణతో చలికి చెక్

ఆపిల్ యోగర్ట్ డ్రింక్ టెట్రా ప్యాక్

ఆపిల్ యోగర్ట్ డ్రింక్ టెట్రా ప్యాక్

అయితే తనకు వచ్చిన పార్సెల్‌ను లీయూ ఎంతో ఉల్లాసంతో.. ఉత్సాహంతో తెరిచిచూడగా, తన కళ్లు బైర్లు కమ్మాయి. ఒక్కసారిగా అందులో ఉన్న ప్రొడక్టును చూసి ఆమె ఖంగుతింది. అందులో తాను ఊహించిన ఆపిల్ ఫోన్‌కు బదులుగా, ఊహించని వస్తువు- ఆపిల్ యోగర్ట్ డ్రింక్ టెట్రా ప్యాక్ ఉంది.

పోలీసులకు ఫిర్యాదు
 

పోలీసులకు ఫిర్యాదు

దీంతో ఆ యువతి ఐఫోన్ సంస్థను మరియు డెలివరీ సర్వీస్ వారిని సంప్రదించింది. అయితే వారు మాత్రం లీయూ ఆర్డర్ చేసిన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్‌నే పంపించినట్లు స్పష్టం చేశాయి. వారి జవాబుతో సంతృప్తి చెందని లీయూ తనకు ఐఫోన్ రాలేదని, అందులో ఆపిల్ డ్రింక్ మాత్రమే ఉందని, అదీకాక డెలివరీ కూడా నేరుగా తన చేతికి ఇవ్వకుండా తమ నివాసంలోని మెయిల్ బాక్సులో వేశారని వాపోయింది. అంతటితో ఆగకుండా లీయూ తనకు జరిగిన మోసాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

స్పందించిన ఎక్స్‌ప్రెస్ మెయిల్ డెలివరీ సర్వీసు

స్పందించిన ఎక్స్‌ప్రెస్ మెయిల్ డెలివరీ సర్వీసు

దీంతో స్పందించిన ఎక్స్‌ప్రెస్ మెయిల్ డెలివరీ సర్వీసు వారు లీయూ ఫిర్యాదుని స్వీకరించామని, తమ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను విచారిస్తున్నట్లు పేర్కొంది. అటు ఆపిల్ సంస్థ కూడా ఇంటర్నల్ ఇంక్వైరీ ప్రారంభించినట్లు పేర్కొంది.

ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌

ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌

ఇంకా విచిత్రం ఏమిటంటే ఆమె ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి బుక్ చేశారు. మరి కంపెనీ నుంచి డెలివరీ వస్తే ఐఫోన్ రావాలి కాని ఇలా డ్రింక్ రావడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మధ్యలోనే ఇది మారిపోయి ఉంటుందని మెయిల్ సర్వీసు ద్వారానే ఈ స్కాం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ కంపెనీ కూడా ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునే ప్రయ్నత్నం చేస్తోంది.

Best Mobiles in India

English summary
A Chinese Woman Orders IPhone 12 Pro Max Online And Receives Apple Drink Instead.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X