ఎయిర్‌టెల్ ప్లాన్లలో భారీ మార్పులు

Written By:

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియోకి పోటీగా దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తున్న రూ.399 ప్లాన్ వాలిడిటీని పెంచింది. జియోని ఢీకొట్టేందుకు ఎయిర్‌టెల్‌ డేటా రేట్లను రోజురోజుకు తగ్గిస్తూ పోతోంది. అంతేకాక తాను అందించే ప్యాక్‌ల వాలిడిటీ పెంచడం, డేటాను ఎక్కువగా ఆఫర్‌ చేయడం కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు మరో నాలుగు ప్రీపెయిడ్‌ ప్యాక్‌లను ఎయిర్‌టెల్‌ సమీక్షించింది. దీనిలో 199 రూపాయల ప్యాక్‌, రూ. 399 ప్యాక్, 448 రూపాయల ప్యాక్‌, 509 రూపాయల ప్యాక్‌ ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌తో వొడాఫోన్‌ జట్టు, అత్యంత తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 399 ప్లాన్

గతంలో ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు ఉండగా, ఇప్పుడు దీన్ని 84 రోజులకు పెంచారు. దీంతో 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటాను ఇప్పుడు కస్టమర్లు పొందవచ్చు. ఇక దీంతోపాటు కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ప్రస్తుతం జియోలో ఇదే తరహాలో రూ.399 ప్లాన్‌లో వినియోగదారులకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. జియోలో కూడా 84 రోజులకు గాను రోజుకు 1జీబీ డేటా లభిస్తున్నది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా వస్తున్నాయి. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ తన రూ.399 ప్లాన్‌ను మార్చింది.

రూ. 199 ప్లాన్

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. కాగా గతంలో ఈ ప్లాన్ మీద రోజుకు 1జిబి డేటా లభించేది. అయితే ఇప్పుడ దాన్ని 400 ఎంబి పెంచడం ద్వారా రోజుకు 1.4జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. అలాగే అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ 199 రూఎయిర్‌టెల్‌, ప్రీపెయిడ్‌ ప్యాక్స్‌, డేటా ఆఫర్‌పాయల ప్యాక్‌, జియో 198 రూపాయల ప్యాక్‌కు గట్టి పోటీ ఇస్తోంది. జియో తన 198 ప్యాక్‌పై రోజుకు 1.5జీబీ డేటాను యూజర్లకు అందిస్తుండగా.. ఎయిర్‌టెల్‌ 1.4జీబీ డేటాను ఆఫర్‌ చేస్తోంది.

రూ. 448 ప్లాన్

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 82 రోజులు. కాగా గతంలో ఈ ప్లాన్ మీద రోజుకు 1జిబి డేటా లభించేది. అయితే ఇప్పుడ దాన్ని 400 ఎంబి పెంచడం ద్వారా రోజుకు 1.4జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. అలాగే అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ 448 రూపాయల ప్యాక్‌, జియో 498 రూపాయల ప్యాక్‌కు పోటీగా ఉంది. ఈ ప్యాక్‌పై కూడా జియో రోజుకు 1.5జీబీ హైస్పీడ్‌ డేటాను 84 రోజుల పాటు ఆఫర్‌ చేస్తోంది.

రూ.509 ప్లాన్

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. కాగా గతంలో ఈ ప్లాన్ మీద రోజుకు 1జిబి డేటా లభించేది. అయితే ఇప్పుడ దాన్ని 400 ఎంబి పెంచడం ద్వారా రోజుకు 1.4జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. అలాగే అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది.

నాలుగు ప్యాక్‌లు మాత్రమే కాక..

ఈ నాలుగు ప్యాక్‌లు మాత్రమే కాక, ఎయిర్‌టెల్‌ 349 రూపాయల ప్యాక్‌ను అప్‌డేట్‌ చేసింది. దీనిపై రోజుకు 2.5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. మిగతా ప్రయోజనాలన్నీ అదేవిధంగా ఉండనున్నాయి. ప్రస్తుతం సమీక్షించిన ప్యాక్‌లు, వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో కంపెనీ అప్‌డేట్‌ చేయలేదు. ఎయిర్‌టెల్‌ కూడా వీటిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Rs. 399 Prepaid Pack Now Offers 1GB Data Per Day for 84 Days to Take on Jio Rs. 398 Plan More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot