Airtel vs Vi: స్వల్పవాలిడిటీలో అధిక డేటా ప్రయోజనాల ప్లాన్‌లలో బెస్ట్ ఏది?

|

ఇండియాలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అన్ని కూడా తన యొక్క వినియోగదారుల కోసం భారీ డేటా ప్రయోజనం గల ప్లాన్‌లను ముఖ్యంగా 3GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభించే ప్లాన్ లను అందిస్తున్నాయి. రోజుకు 3GB ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక అంశం OTT స్ట్రీమింగ్ ప్రయోజనాల ఉచిత యాక్సిస్ మరియు ప్లాన్ యొక్క చెల్లుబాటు. ఈ రెండు ప్రమాణాలను హైలైట్ చేయడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. 28 రోజుల నుండి 84 రోజుల చెల్లుబాటు కాలంతో లభించే వాటిలో స్వల్పకాలిక వ్యాలిడిటీతో వస్తున్న Airtel మరియు Vi యొక్క 3GB రోజువారీ డేటా ప్లాన్‌లలో ఏ ప్రొవైడర్ తమ కస్టమర్‌లకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తున్నదో వంటి వివరాలు వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ 3GB రోజువారీ డేటా ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ 3GB రోజువారీ డేటా ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ టెల్కో దాని ప్రీపెయిడ్ పరిధిలో రెండు 3GB రోజువారి డేటా ప్లాన్‌లను కలిగి ఉంది. ఇందులో ఒకటి రూ.599 కాగా మరొకటి రూ.699 ధరల వద్ద లభిస్తుంది. మొదటిది ఎయిర్‌టెల్ యొక్క రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMS లతో పాటు రోజుకు 3GB డేటా ప్రయోజనాలను అందిస్తోంది. డేటా పరిమితి తర్వాత వేగం 64Kbpsకి తగ్గుతుంది. SMS రోజువారీ పరిమితి తరువాత మెసేజ్ లకు స్థానిక టెక్స్ట్‌లకు రూ. 1 మరియు STD SMS కోసం రూ. 1.50 వసూలు చేయబడుతుంది. అదనపు ప్రయోజనాలలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు 56 రోజుల యాక్సెస్, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో ఎంచుకున్న Xstream ఛానెల్‌లలో ఏదైనా ఒకదానికి 56 రోజుల యాక్సెస్ మరియు అపోలో మూడు నెలల యాక్సెస్‌తో సహా ఇతర ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ప్రయోజనాలతో సహా కొన్ని అదనపు ప్రయోజనాలను జోడిస్తాయి. 24/7 సర్కిల్ యాప్, షా అకాడమీలో ఉచిత కోర్సులు, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హలో ట్యూన్‌లు మరియు ఉచిత వింక్ మ్యూజిక్ వంటివి కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ రూ.599 ధర అందించే ప్రీపెయిడ్ ప్లాన్ నెలవారీ ఎంపికలను చూసే చందాదారుల కోసం 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ చందాదారులకు అపరిమిత కాల్స్, 100 SMS/రోజు మరియు 3GB/రోజు ప్రయోజనాలను అందిస్తుంది. ఇవే కాకుండా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ప్రయోజనాలతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తుంది. దీనితో పాటుగా 30-రోజుల ఉచిత మొబైల్ ఎడిషన్ ప్రైమ్ వీడియో ట్రయల్ మినహా ఎలాంటి అదనపు స్ట్రీమింగ్ ప్రయోజనం లేదు.

వోడాఫోన్ ఐడియా (Vi) 3GB రోజువారీ డేటా ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) 3GB రోజువారీ డేటా ప్లాన్‌లు

Vi యొక్క 3GB రోజువారి డేటా ప్లాన్‌ల విషయానికి వస్తే చందాదారులు పరిగణించవలసిన ఎంపికల శ్రేణిని కలిగి ఉన్నారు. రూ.475 ధర వద్ద లభించే Vi ప్రీపెయిడ్ ప్లాన్ 3GB/రోజు, 100 SMS/రోజు మరియు అపరిమిత వాయిస్ కాల్‌ ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. దీనితో పాటుగా ఉదయం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటా, వీకెండ్ లో వారం మొత్తంలో ఉపయోగించని డేటాను క్యారీ చేసే సదుపాయం మరియు 2GB బ్యాకప్ డేటా వంటి Vi యొక్క ఫ్లాగ్‌షిప్ డేటా ఆఫర్‌లు భారీ డేటా వినియోగదారులకు ప్లాన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. స్ట్రీమింగ్ కోసం ప్లాన్ Vi Movies మరియు TV యాక్సెస్‌తో వస్తుంది.

Vi టెల్కో

Vi టెల్కో నుంచి లభించే 3GB/రోజు మరొక ప్లాన్ రూ.601 ధరతో లభిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో అదే ప్రయోజనాలను అందిస్తోంది. 3GB రోజువారీ డేటాతో పాటు సబ్‌స్క్రైబర్‌లు ఈ ప్లాన్‌తో అదనంగా 16GB పొందవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కి ఒక సంవత్సరం ఉచిత యాక్సిస్ మరొక ఆకర్షణ. అన్నింటికంటే మించి ఈ ప్లాన్ Vi యొక్క ఫ్లాగ్‌షిప్ డేటా ఆఫర్‌లు మరియు Vi సినిమాలు మరియు టీవీకి యాక్సెస్‌తో వస్తుంది. రెండు నెలల చెల్లుబాటు కోసం చూస్తున్న సబ్‌స్క్రైబర్‌లు రూ.699 ధర వద్ద లభించే ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. ఇది 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMSలతో పాటు Vi ఫ్లాగ్‌షిప్ డేటా ప్రయోజనాలతో వస్తుంది. రూ.901 ధర వద్ద లభించే మరొక 3GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల చెల్లుబాటుతో వస్తోంది. సాధారణ డేటాతో పాటు ఇది 48GB అదనపు డేటా మరియు ఇతర Vi ఫ్లాగ్‌షిప్ డేటా ఆఫర్‌లను కూడా అందిస్తుంది. స్ట్రీమింగ్ కోసం డిస్నీ+ హాట్‌స్టార్‌కి ఒక-సంవత్సరం మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మరియు Vi సినిమాలు మరియు టీవీకి యాక్సెస్ రెండింటితో వస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel vs Vi: Which is The Best of The High Data Utility Plans at Short Term Validity?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X