డౌన్‌లోడ్ స్పీడ్ లో రారాజుగా ఎదిగిన Airtel

|

టెలికాం ఆపరేటర్లలోని ఎయిర్‌టెల్ సంస్థ ప్రస్తుతం డౌన్‌లోడ్ స్పీడ్ మరియు ఇతర పారామితులలో నాణ్యతలో స్థిరత్వం పరంగా వోడాఫోన్ మరియు జియోలను వెనుకకు నెట్టి మొదటి స్థానాన్ని అందుకున్నట్లు టుటెలా నివేదించింది. నివేదిక ప్రకారం వేగవంతమైన నెట్‌వర్క్ లలో ఎయిర్‌టెల్ 7.4mbps సగటు డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తున్నది. అలాగే వొడాఫోన్ ఐడియా 6.5mbps డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తుండగా మూడవ స్థానంలో ఉన్న జియో 5.3 mbps డౌన్‌లోడ్ వేగాన్ని కలిగి ఉంది.

డౌన్‌లోడ్ స్పీడ్ లో రారాజుగా ఎదిగిన Airtel

 

డౌన్‌లోడ్ వేగంలో ఎయిర్‌టెల్ సంస్థ తరువాతి స్థానంలో ఉన్న జియో మరియు వొడాఫోన్ ఐడియా కంటే దాదాపు 10 రెట్లు మెరుగ్గా ఉండి అద్భుతమైన స్థిరమైన నాణ్యతను కలిగి ఉంది. అప్‌లోడ్ స్పీడ్ విషయానికి వస్తే వోడాఫోన్ ఐడియా 3.7 Mbps సగటు అప్‌లోడ్ వేగంతో రేసులో అందరికంటే ముందుంది. తరువాత స్థానాలలో ఎయిర్‌టెల్ 3.5 Mbps వేగంతో మరియు జియో 3.2 Mbps వేగంతో ఉన్నాయి.

డౌన్‌లోడ్ స్పీడ్ లో రారాజుగా ఎదిగిన Airtel

బిఎస్ఎన్ఎల్ మరియు ఎంటిఎన్ఎల్ విలీనంతో పాటు 5G నెట్‌వర్క్‌ల రాకతో వచ్చే సంవత్సరంలో ఏదో ఒక సమయంలో టెలికాం పరిశ్రమలో కీలకమైన మార్పులు జరగవచ్చు. ప్రతి ఆపరేటర్ ప్రస్తుత మార్పులను అనుగుణంగా తమని తాము ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ వస్తున్నారు. రాబోయే కాలంలో ఎటువంటి మార్పులు జరగనున్నాయో వేచి చూడాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel vs Vodafone vs Jio : Who Leads in The Download Speed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X