జియోఫైబర్ ప్లాటినం ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

|

ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమ గత కొన్ని నెలల్లో చాలా మార్పులు జరిగాయి. రిలయన్స్ జియో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సమర్పణ జియోఫైబర్ రావడం దీనికి కారణం. జియోఫైబర్ ప్రారంభించటానికి ముందు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు మరియు టెలికాం ఆపరేటర్లు ఈ పోటీకి సన్నద్ధమయ్యారు. ఈ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఎప్పుడు లేనంత పోటీ గత రెండు నెలలో అందరు చూసారు.

రిలయన్స్ జియో
 

రిలయన్స్ జియో యొక్క ప్రధాన పోటీదారులలో భారతి ఎయిర్‌టెల్ ఒకరు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెల్కోకు బలమైన పోటీదారుగా భారతి మిట్టల్ నేతృత్వంలోని భారతి ఎయిర్‌టెల్ ఉంది. ఎయిర్‌టెల్ అనేది గట్టి పోటీ అని ఎందుకంటే టెల్కో జియోతో బ్రాడ్‌బ్యాండ్ విభాగంలోనే కాకుండా ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ విభాగంలో కూడా పోటీ పడుతోంది. ఇప్పుడు టెల్కోస్ రెండింటి నుండి కొత్తగా వచ్చిన కొన్ని సమర్పణల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గిగాబైట్ కనెక్షన్లు

ఇండియాలో ప్రస్తుతం గిగాబైట్ కనెక్షన్లు గొప్ప విషయం కానప్పటికీ అవి ప్రస్తుతం ఇంటర్నెట్‌ విషయంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. భారతదేశంలో భారీ ఫైబర్ నెట్‌వర్క్ యొక్క విస్తరణ ఎంపిక చేసిన ఆపరేటర్లకు 1 Gbps వేగంతో అందించే హై-స్పీడ్ కనెక్షన్‌లను రూపొందించడానికి వీలు కల్పిస్తోంది. జియోఫైబర్ తన ప్లాన్‌లను అధిక వేగంతో ప్రకటించింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ తన ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇప్పుడు రెండు టెల్కోలు తమ ప్రీమియం ప్లాన్‌లతో బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా పోటీకి దిగుతున్నాయి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ సర్వీస్ యొక్క రూ.3999ల వివరాలు
 

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ సర్వీస్ యొక్క రూ.3999ల వివరాలు

ఇప్పుడు ఎయిర్‌టెల్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ సర్వీస్ యొక్క వివరాల విషయానికి వస్తే ఇది చందాదారులకు జియో ఫైబర్ యొక్క ప్లాటినం ప్లాన్ 3,999 రూపాయల ధరతోనే లభిస్తుంది. ఎయిర్టెల్ క్లెయిమ్ చేసినట్లుగా ఈ ప్లాన్ చందాదారులకు 1 Gbps స్పీడ్ తో అపరిమిత డేటాను అందిస్తుంది. కాని డేటా వాస్తవానికి చందాదారుల కోసం 3.3TB వద్ద క్యాప్ చేయబడుతుంది. అంతేకాకుండా చందాదారులు ఈ ప్లాన్‌తో అదనపు ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. ఈ అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే అవి మూడు నెలలపాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ , ఒక సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ మరియు అదనంగా ZEE5 లకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎయిర్టెల్ 1000GB అదనపు డేటాను కూడా వినియోగదారులకు అందించనుంది.

రూ.3,999ల రిలయన్స్ జియోఫైబర్ ప్లాటినం ప్లాన్ వివరాలు

రూ.3,999ల రిలయన్స్ జియోఫైబర్ ప్లాటినం ప్లాన్ వివరాలు

రిలయన్స్ జియోఫైబర్ 3999 రూపాయల ధర వద్ద ప్లాటినం ప్లాన్‌ను చందాదారులకు 1 Gbps స్పీడ్ తో అందిస్తుంది. ఈ ప్లాన్‌తో చందాదారులు నెలకు 2500 GB డేటాను పొందుతారు. మీరు దీనిని జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కస్టమర్లు ఆనందించే దానికంటే చాలా తక్కువ. జియోఫైబర్ అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఐదు డివైస్ ల కోసం టీవీ వీడియో కాలింగ్, జీరో-లేటెన్సీ గేమింగ్ మరియు నార్టన్ డివైస్ సెక్యూరిటీని కలిగి ఉంటాయి. చందాదారులు జియో నుండి ఉచిత సెట్-టాప్ బాక్స్‌కు కూడా యాక్సిస్ పొందుతారు. కాని చందాదారులు విడిగా LCO కనెక్షన్‌ను పొందాలి. జియో కూడా OTT యాప్ లకు సభ్యత్వాన్ని అందిస్తుంది. అయితే ఇవి ఏ OTT యాప్ లు అవుతాయో స్పష్టంగా తెలియదు.మరికొన్ని ప్రయోజనాలలో VR మరియు ఫస్ట్ డే-ఫస్ట్ షో మూవీస్ కూడా ఉన్నాయి.

పోలిక

పోలిక

ఈ రెండు టెల్కోలు అందించే ప్రయోజనాల మధ్య పోలికను సంగ్రహంగా చెప్పాలంటే జియోఫైబర్ ప్లాటినం ప్లాన్‌తో పోల్చితే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వైపు చందాదారుల నిర్ణయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అనేది చందాదారులకు ఎక్కువ డేటాను అందిస్తుందనేది మొదటి కారణం. అలాగే అదనపు ప్రయోజనాల పరంగా వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా ఆనందించే అవకాశం కూడా ఉంది. అయితే రిలయన్స్ జియోఫైబర్ యొక్క అదనపు ప్రయోజనాల కోసం కస్టమర్లు యాడ్-ఆన్ కొనుగోళ్లు చేయవలసి ఉంటుంది. తద్వారా వారికి మరింత డబ్బును వెచ్చించవలసిన అవసరం ఉంది. జియోఫైబర్ కనెక్షన్‌కు రూ .1,000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీలతో సహా 2,500 రూపాయల ముందస్తు డిపాజిట్ కూడా అవసరమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తీర్పు

తీర్పు

పైన పేర్కొన్న పోలికల ఆధారంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ సర్వీస్ అనేది రిలయన్స్ జియోఫైబర్ ప్లాటినం ప్లాన్‌కు ఎంత గట్టి పోటీ ఇస్తోందో ప్రత్యేకంగా తెలుస్తోంది. దరల పరంగా రెండు సమానం అయినప్పటికి డేటాను అందించడంలో వ్యత్యాసం ఉంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ సర్వీస్ జియోఫైబర్ కంటే ఎక్కువ డేటాను అందిస్తోంది. అదనపు ప్రయోజనాల విషయంలో రెండు తమ తమ దోరణిలో అందిస్తున్నాయి కావున ఇందులో మీకు ఇష్టమైన దాన్ని ఎంచుకోవడం మీ యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber Rs 3,999 Plan vs Reliance JioFiber Rs 3,999 Plan Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X