జియోకి పోటీగా ఎయిర్‌టెల్ మళ్లీ దుమ్మురేపింది

Written By:

జియోరాకతో టెలికం దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జియో ఉచిత ఆఫర్లతో కష్టమర్లను తన వైపుకు తిప్పుకోనీకుండా దాదాపు అన్ని టెల్కోలు భారీగానే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో నంబర్ వన్ నెట్ వర్క్ ఎయిర్‌టెల్ ముందు వరుసలో దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా రూ. 549, రూ.799 ప్లాన్లతో సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది.

సీక్రెట్‌‌గా శాంసంగ్ గెలాక్సీ S8, పేరు నిలబెడుతుందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యాపీ న్యూ ఇయర్' ఆఫర్

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండిపోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం 'హ్యాపీ న్యూ ఇయర్' ఆఫర్ అంటూ రూ. 549, రూ. 799 రీచార్జ్ తో అపరిమిత కాల్స్, డేటా ప్లాన్ ప్రవేశపెట్టింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 549 ప్లాన్

రూ. 549 ప్లాన్ లో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ రోమింగ్ కాల్స్ ఉంటాయి. దీంతో పాటు నెలకు వింక్ మ్యూజిక్, మూవీ సేవలు కూడా అందుతాయి. అంతేకాకుండా రోజుకు 100 లోకల్, నేషనల్ ఎసెమ్మెస్ లు పంపుకోవచ్చు. 3జీబి 4జీ డేటా లభిస్తుంది. అదే 3జీ ఫోన్ యూజర్లకయితే 1జిబి 3జీ డేటా లభిస్తుంది.

రూ. 799 ప్లాన్

రూ. 799 ప్లాన్ లో కూడా రూ. 549 ప్లాన్ లో లభించినట్లు అన్ని సేవలు లభిస్తాయి. అయితే ఇందులో అదనంగా 5జీబి 4జీ డేటా లభిస్తుంది. అదే 3జీ యూజర్లకయితే 2జిబి 3జీ డేటా లభిస్తుంది.

పాత ఆఫర్ తో కొత్త ఆఫర్లను పోల్చి చూస్తే

కంపెనీ ఇప్పటికే రూ. 1199 ప్లాన్ తో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ తో కొత్త ఆఫర్లను పోల్చి చూస్తే చాలా ఎక్కువ ఫ్రయోజనం కలిగిస్తాయని కంపెనీ చెబుతోంది. కొత్త ఆఫర్లలో వింక్ మ్యూజిక్ తో పాటు సినిమాలు కూడా చూసే సౌలభ్యం ఉంది.

ఫీచర్ లో ఇంకా సరికొత్త ప్లాన్లను

అయితే ఎయిర్‌టెల్ ఫీచర్ లో ఇంకా సరికొత్త ప్లాన్లను తీసుకురానుందని తెలుస్తోంది. రూ. 1199 ప్లన్ లోనే డేటాను పెంచే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇది 15జిబి, 20 జిబి, 30 జిబి వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ జిబిల ధరలు ఇప్పుడు రూ. 1,599, రూ. 1,999, రూ. 2,999 గా ఉన్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel's New Infinity Postpaid Plans Start Rs. 549 With Unlimited Voice Calls, Data Benefits read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot