అమెజాన్ అతిపెద్ద డెలివరీ స్టేషన్ హైదరాబాద్ లో

|

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ యొక్క చివరి మైలు డెలివరీ సామర్థ్యాలను శక్తివంతం చేయడానికి అమెజాన్ ఇండియా తన అతిపెద్ద డెలివరీ స్టేషన్‌ను హైదరాబాద్ సమీపంలోని రంగ రెడ్డి జిల్లాలో ప్రారంభించినట్లు ప్రకటించింది.20,000 చదరపు అడుగుల విస్తరణతో అమెజాన్ స్టోర్ ఇప్పుడు 90 కి పైగా డెలివరీ స్టేషన్లు మరియు డెలివరీ సర్వీస్ పార్టనర్ స్టేషన్లను కలిగి ఉంది.

amazon launches telangana s largest delivery station near hyderabad

అమెజాన్ ఇండియా రాష్ట్రంలో 2,500 కన్నా ఎక్కువ 'ఐ హావ్ స్పేస్' డెలివరీ భాగస్వాములను కలిగి ఉందని అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ ట్రాన్స్ పోటేషన్ డైరెక్టర్ ప్రకాష్ రోచ్లాని చెప్పారు.

డెలివరీ విస్తరణ:

డెలివరీ విస్తరణ:

దాని డెలివరీ నెట్‌వర్క్ రెట్టింపు కావడం వల్ల ఇ-కామర్స్ సైట్ తెలంగాణ అంతటా చిన్న పట్టణాల్లోకి మరింత చొచ్చుకుపోతుంది. సంగారెడ్డి, కోతగుడెం, సిద్దిపేట మరియు జగిత్యాల్ వంటి చిన్న నగరాలు మరియు పట్టణాల్లో కూడా తన డెలివరీ నెట్‌వర్క్ విస్తరణను కంపెనీ ప్రకటించింది.

ఫాస్ట్ డెలివరీ సదుపాయం:

ఫాస్ట్ డెలివరీ సదుపాయం:

ఇంతకుముందు ఒక రోజు మరియు రెండు రోజుల డెలివరీలను కొన్ని ప్రదేశాలలో మాత్రమే అందిస్తున్నారు. కాని ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల వున్న ప్రాంతాలలో గణనీయమైన సంఖ్యలో వినియోగదారులు అదే రకమైన సదుపాయాన్ని పొందగలుగుతారు అని రోచ్లాని చెప్పారు. అమెజాన్ కంపెనీ ప్రధానంగా పెట్టుబడి పెట్టిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని అన్నారు.

జాబ్స్:
 

జాబ్స్:

ఈ విస్తరణ వలన తెలంగాణలోని వేలాది మంది వ్యక్తులకు జాబ్ అవకాశాలను కలిపిస్తోంది. అమెజాన్ కోసం పార్ట్‌టైమ్ జాబ్ చేయడానికి వ్యక్తులకు వేలాదిగా అవకాశాలను కల్పించడంలో సహాయపడే అమెజాన్ ఫ్లెక్స్ వంటి ప్రోగ్రామ్‌లతో మౌలిక సదుపాయాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంపై దీర్ఘకాలిక పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాము అని రోచ్లానీ చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం సహకారం:

తెలంగాణ ప్రభుత్వం సహకారం:

ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వంలో ఐటి అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ అమెజాన్ పెట్టుబడి మరియు నిబద్ధత తెలంగాణలో సాంకేతిక పరిజ్ఞానం మరియు నైపుణ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని అన్నారు. కంపెనీలకు రాష్ట్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది మరియు తెలంగాణ రాష్ట్రం కంపెనీ ఇష్టపడే ఎంపికగా ఉంటుందని ఆయన చెప్పారు.

స్థలం విస్తీరణం:

స్థలం విస్తీరణం:

అమెజాన్ ఇండియా హైదరాబాద్‌లో 3.2 మిలియన్ క్యూబిక్ అడుగుల కంటే ఎక్కువ స్థలంలో తమ స్టోర్ ని కలిగి ఉంది.ఇది 100,000 చదరపు అడుగుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో హైదరాబాద్‌లో రెండు సార్టింగ్ కేంద్రాలను కలిగి ఉంది.తెలంగాణలో రాష్ట్రంలో అమెజాన్ యాజమాన్యంలోని 90 భాగస్వామి డెలివరీ స్టేషన్లకు సుమారు17,000 మంది అమ్మకందారులతో కలసి ఉంది.

 

 

Best Mobiles in India

English summary
amazon launches telangana s largest delivery station near hyderabad

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X