గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్

Posted By:

భారతీయ మహిళా ప్రో - గేమర్స్ గురించి మీరు ఎపుడైనా విన్నారా..?, ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీ‌లో గేమింగ్ నైపుణ్యాలను కలిగి ఉన్న కొద్ది మంది మహిళల్లో అపూర్వా మోహన్ ఒకరు. ఈమె కోడ్ నేమ్ ‘Ir0nb@b3'. టాప్ గేమింగ్ టీమ్‌లలో ఒకటైన ‘EvoX'లో అపూర్వా మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పలువురు టెక్నాలజీ లెజెండ్స్ ఇటీవల ఆమెతో ముచ్చటించే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా అపూర్వా మోహన్ వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలను వారితో పంచుకున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

ప్రశ్న: మీరు గేమింగ్ ప్రపంచంలో ఎప్పుడు అడుగుపెట్టారు..?

జవాబు: నాకు చిన్నప్పటి నుంచి గేమింగ్ అంటే ఇష్టం. మా నాన్న గేమర్. ఆయనతో గేమ్ ఆడుతూ ఎంతో ఎంజాయ్ చేసే దాన్ని. మారియో, కాంట్రా వంటి గేమ్‌లను ఎక్కువుగా ఆడేదాన్ని. ఆ రోజులు ఇప్పటికి మరిచిపోలేను. షాపింగ్ మాల్స్‌కు తరచుగా వెళ్తూ ఉండటం వల్ల నాకు 19, 20 సంవత్సరాల వయసులో BYOC తరహో గేమింగ్ ఈవెంట్స్ ఉంటాయని తెలుసుకున్నాను. నేను పాల్గొన్న మొట్టమొదటి బీవైఓసీ (బ్రింగ్ యువర్ వౌన్ కంప్యూటర్) గేమింగ్ ఈవెంట్‌లో అనేక మంది గేమర్లను కలుసుకున్నాను. మల్టీప్లేయర్ మోడ్‌లో ఆట మరింత మజానిస్తుందన్న విషయాన్ని అప్పుడే తెలుసుకున్నాను.

 

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

ఈవీవోఎక్స్ (EvoX) గేమింగ్ లో మీరు ఏలా భాగమయ్యారు..?

నా మొదటి BYOC ఈవెంట్‌లో భాగంగా EvoX జట్టు కెప్టెన్ ముఖుల్ సబానీ (TeRm!N@ToR)ని కలుసుకున్నాను. అక్కడ ఉన్న వారిలో అతనే బెగ్గరగా అరుస్తున్నాడు. అప్పుడే తెలుసుకున్నాను EvoX గురించి. మొదట్లో నేను కౌంటర్ స్ట్రైక్ 1.6 గేమ్‌తో బరిలోకి దిగేదాన్ని, ఆ తరువాత నుంచి సీవోడీ (కాల్ ఆఫ్ డ్యూటీ ఫర్ మోడ్రన్ వార్‌ఫేర్) గేమ్ ఆడటం మొదలుపెట్టాను. అందులో నేను రాణించాను కూడా. EvoXలో జాయిన్ అవ్వమని TeRm!N@ToR అడగటంతో ఆ టాప్ గేమింగ్ టీమ్ లో ఆడే అవకాశం లభించింది. అప్పటినంచి భారత్ లో జరుగుతోన్న అన్ని గేమింగ్ ఈవెంట్ లలోనూ EvoX తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాను.

 

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

ప్రో-గేమర్ గా గుర్తింపు తెచ్చుకునే క్రమంలో ఏమైనా ఇబ్బందులను ఎదుర్కొన్నారా..?

నా అభిప్రాయం ప్రకారం ప్రో-గేమర్ గా మారాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. నిరంతర సాధన అవసరం.

 

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

మీ టీమ్ కోసం మీరిచ్చిన తోడ్పాటు

నేను EvoX తరుపున కోడ్ 4ను ఆడాను. ఇండియన్ సైబర్ గేమింగ్ ఛాంపియన్ షిప్‌లో నేనిచ్చిన ప్రదర్శన అత్యుత్తమమైనది.

 

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

ప్రశ్న: ప్రో-గేమర్‌గా మీ బెస్ట్ అనుభవమేది..?

జవాబు: ఆటలో ప్రతి క్షణాన్ని అత్యుత్తమంగా భావిస్తాను. మా టీమ్ గెలుపొందాలని ఎల్లప్పుడు ఆకాంక్షిస్తాను.

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

ప్రశ్న: భారత్‌లో  మహిళా గేమర్స్ చాలా అరుదు, ఆ అవకాశం మీకు దక్కినందుకు మీరు ఏలా ఫీలవుతున్నారు..?

జవాబు: ఇది పెద్ద విషయంలా నేను భావించటంలేదు. ఆటకు అవసరమైంది నైపుణ్యం మాత్రమే.

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

మహిళా గేమర్‌లను ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీకి పరిచేయం చేయటంలో మీ పాత్ర ఎంత..?

మహిళా గేమర్‌లను చాలా రకాలుగా ప్రోత్సహిస్తాను. చాలా మంది  గేమింగ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించేందకు ఆసక్తిగా ఉన్నారు. 

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

ప్రో-గేమింగ్ రంగంలోకి ప్రవేశించకుంటే..?

ప్రో-గేమింగ్ రంగంలోకి ప్రవేశించకుంటే యానిమేటర్‌ను అయి ఉండేదాన్ని.

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

మీ హాబిస్ ఏంటి..?

మాంగాస్ బాగా చదువుతాను, యానిమేషన్ చిత్రాలను బాగా చూస్తాను.

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

ఎటువంటి గేమ్స్ ఆడేందకు ఇష్టపడతారు..?

హార్డ్‌కోర్ గేమ్‌లను బాగా ఇష్టపడతాను.

గేమింగ్‌లో దూసుకెళుతోన్న అపూర్వా మోహన్ (ఇంటర్వ్యూ)

గేమర్‌గా ఎప్పటి వరకు కొనసాగుతారు..?

గేమింగ్ నా జీవితంలో ఒక భాగం. నేను జీవించి ఉన్నంత వరకు మంచి గేమర్‌గానే ఫీలవుతాను.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apoorva Mohan a.k.a ir0nb@b3: The Female Gamer. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot