ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!

By Maheswara
|

భవిష్యత్తులో ఆపిల్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ గురించి సమాచారాన్ని అందించిన మింగ్-చి కువో నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫోల్డబుల్ ఐప్యాడ్ 2025 లో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. కుపెర్టినో-ఆధారిత స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఈ పరికరాన్ని వచ్చే ఏడాదిలోనే విడుదల చేసే అవకాశం కూడా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆపిల్ తో కలిసి భాగమయ్యే అంజీ టెక్నాలజీ గురించి కూడా కువో (Kuo) వివరించారు. ఈ ఫోల్డబుల్ ఐప్యాడ్ యొక్క వినూత్న డిజైన్ ద్వారా మార్కెట్లో మంచి డిమాండు ఉంటుందని తెలుస్తోంది.

 
Apple Expected To Launch Foldable iPad With This New Feature.

ఆపిల్ ఫోల్డబుల్ ఐప్యాడ్

మొదటగా ఆపిల్ తన అంతర్నిర్మిత కిక్‌స్టాండ్‌కు సంబంధించింది వివరాలను వివరిస్తుంది. ఈ పరిస్థితిపై ప్రత్యక్ష అవగాహన ఉన్న వ్యక్తులు తెలియచేసే సమాచారం ప్రకారం ఈ కిక్‌స్టాండ్ కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడుతుందనే పుకార్లు ఉన్నాయని విశ్లేషకుడు పేర్కొన్నారు. మరోక్క మాటలో చెప్పాలంటే, ఆపిల్ ఖచ్చితంగా తన పట్టుదలను మరియు ఓర్పును కొనసాగిస్తూ ఫోల్డబుల్ ఐప్యాడ్‌ను చాలా తేలికగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అదనంగా, కువో ఐప్యాడ్ షిప్‌మెంట్‌ల గురించి కూడా చర్చించారు మరియు 2023లో మార్కెట్ క్షీణతను ఆయన అంచనా వేశారు, ఎందుకంటే రాబోయే తొమ్మిది నుండి పన్నెండు నెలల్లో కొత్త ఐప్యాడ్‌లు ఏవీ లాంచ్ ఉండకపోవచ్చు అని తెలిపారు.

 

ఆపిల్ ఫోల్డబుల్ ఐప్యాడ్ కిక్‌స్టాండ్‌ ఫీచర్

ఆపిల్ యొక్క తర్వాతి ఐప్యాడ్, ఐప్యాడ్ మినీ అప్‌డేట్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో భారీ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్ల, అతను ఈ సంవత్సరం ఐప్యాడ్ అమ్మకాలు మరియు షిప్‌మెంట్‌లలో 10 నుండి 15% తరుగుదలను అంచనా వేస్తున్నారు. ఇది Apple నుండి మొట్టమొదటి ఫోల్డబుల్ టాబ్లెట్ అవుతుంది మరియు దీని ధర కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Apple Expected To Launch Foldable iPad With This New Feature.

ప్రపంచ ఐఫోన్లలో 25% ఇండియా లోనే తయారీ!

యాపిల్ తన ఐఫోన్ ల ఉత్పత్తిని చైనా నుంచి ఇతర దేశాలకు మార్చాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. మరిన్ని ఐఫోన్‌లను తయారు చేయడంలో కుపెర్టినో టెక్ దిగ్గజం దృష్టిలో ఉన్న దేశం భారతదేశం. ఆపిల్ ఇప్పటికే భారతదేశంలో సరికొత్త ఐఫోన్‌లను తయారు చేస్తోంది మరియు పరిణామాల ప్రకారం, భారతదేశంలో ఐఫోన్‌ల ఉత్పత్తి వాటాను 25%కి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఇది నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో మరియు అంతర్జాతీయ మార్కెట్‌లకు తగినట్లు (భారతదేశంలో తయారు చేయబడిన ఫోన్లను ) మరిన్ని ఐఫోన్‌లను ఎగుమతి చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది.

Apple Expected To Launch Foldable iPad With This New Feature.

నివేదిక ప్రకారం ప్రకారం, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన సమాచారం ప్రకారం, ఆపిల్ ఇప్పటికే భారతదేశంలో దాని తయారీలో 5% నుండి 7% వరకు చేస్తోంది మరియు భవిష్యత్తులో ఈ వాటాను 25%కి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఈ లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకోవాలని చూస్తుందో గోయల్ వివరించలేదు. Apple తన తయారీ భాగస్వామ్యాన్ని 2017లో విస్ట్రాన్‌తో తిరిగి ప్రారంభించింది, ఆపై Apple యొక్క మరొక తయారీ భాగస్వామి అయిన Foxconn భారతదేశంలో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసింది.

iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ అయింది

Apple సంస్థ తమ ఐఫోన్లు,ఐపాడ్లు మరియు ఇతర ఆపిల్ పరికరాల కోసం iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సరికొత్త అప్డేట్ వెర్షన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ కు iOS 16.3 గా నామకరణం చేసారు.Apple ఐఫోన్ 8 మరియు దాని తర్వాత మోడళ్ళు , iPad Pro (అన్ని మోడళ్లు ), iPad Air 3వ తరం మరియు దాని తరువాత మోడళ్ళు, iPad 5వ తరం మరియు తరువాత మోడళ్ళు , ఇంకా, iPad mini 5th జనరేషన్ మరియు ఆ తర్వాత వచ్చిన పరికరాలు Apple iOS 16.3 కొత్త అప్డేట్ ను పొందడానికి సపోర్ట్ చేస్తాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Expected To Launch Foldable iPad With This New Feature.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X