త్వరపడండి, ఆపిల్ ఐఫోన్లపై రూ. 17 వేల వరకు డిస్కౌంట్

|

ఆపిల్‌ ఫోన్‌ కొనాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్‌పై కంపెనీ భారీ రాయితీలు ప్రకటించింది. కంపెనీ తన ప్రతిష్టాత్మక ఐఫోన్‌ను ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మార్పులు చేసి ఐఫోన్ ఎక్స్ఆర్‌, ఎక్స్ఎస్‌, ఎక్స్ఎస్‌ మ్యాక్స్ అనే మూడు మోడళ్లను విడుదల చేయడంతో.. పాత మోడళ్ల ధరలను తగ్గించింది.

 త్వరపడండి, ఆపిల్ ఐఫోన్లపై రూ. 17 వేల వరకు డిస్కౌంట్

 

అన్ని వేరియంట్ల ధరపై రూ. 17,000 తగ్గించింది. ఈ పరిమితకాల డిస్కౌంట్‌ ఆఫర్‌ ఏప్రిల్‌ 5 నుంచి అందుబాటులోకి రానుంది

ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(64జీబీ)

ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(64జీబీ)

ప్రస్తుతం ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(64జీబీ) ధర రూ. 76,900గా ఉంది. డిస్కౌంట్‌పై ఇది రూ. 59,900కే రానుంది.

 128 జీబీ ఎక్స్‌ఆర్‌

128 జీబీ ఎక్స్‌ఆర్‌

128 జీబీ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 81,900 నుంచి రూ. 64,900కు తగ్గనుంది.

ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(256జీబీ)

ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(256జీబీ)

ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌(256జీబీ) ధర రూ. 91,900 నుంచి రూ. 74,900లకు దిగిరానుంది.

10శాతం అదనపు రాయితీ
 

10శాతం అదనపు రాయితీ

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసిన వారికి మరో 10శాతం అదనపు రాయితీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది కేవలం పరిమితకాల ప్రమోషనల్‌ ఆఫర్‌ మాత్రమేనని, శాశ్వత ధర తగ్గింపు కాదని కంపెనీ స్పష్టం చేసింది.

శాంసంగ్‌, షియోలాంటి కంపెనీల నుంచి పోటీ

శాంసంగ్‌, షియోలాంటి కంపెనీల నుంచి పోటీ

ఇటీవలి కాలంలో భారత్‌లో ఐఫోన్‌ విక్రయాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ధర ఎక్కువగా ఉండటంతో పాటు.. శాంసంగ్‌, షియోలాంటి కంపెనీల నుంచి పోటీ అధికంగా ఉండటంతో ఐఫోన్‌ విక్రయాలు మందగించాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను తీసుకొచ్చిందని ఆపిల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple iPhone XR Prices in India Slashed, Now Starts at Rs 59,900

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X