అత్యంత తక్కువ ధరకే ఆపిల్ మ్యూజిక్ సేవలు

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ త‌న ఆపిల్ మ్యూజిక్ సేవ‌ల‌ను భార‌త్‌లో 2015లో ప్రారంభించిన విష‌యం అందరికీ విదిత‌మే. ఈ సేవ‌ల‌ను పొందేందుకు ఆపిల్ మూడు ర‌కాల ప్లాన్ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

|

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ త‌న ఆపిల్ మ్యూజిక్ సేవ‌ల‌ను భార‌త్‌లో 2015లో ప్రారంభించిన విష‌యం అందరికీ విదిత‌మే. ఈ సేవ‌ల‌ను పొందేందుకు ఆపిల్ మూడు ర‌కాల ప్లాన్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.120, రూ.190, రూ.60 ల‌కు వ్య‌క్తిగ‌త‌, ఫ్యామిలీ, స్టూడెంట్ ప్లాన్ల‌ను ఆపిల్ మ్యూజిక్‌లో ఆపిల్ కంపెనీ అందిస్తున్న‌ది.

అత్యంత తక్కువ ధరకే ఆపిల్ మ్యూజిక్ సేవలు

ఇండియన్ మార్కెట్, యూజర్లను దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్యాక్ లను ఈ సంస్థ తగ్గించింది. అయితే తాజాగా ఆపిల్ ఈ ఛార్జిల రుసుమును త‌గ్గించింది. దీంతో ఇక‌పై ఈ ప్లాన్లు వ‌రుస‌గా రూ.99, రూ.149, రూ.49ల‌కు ల‌భిస్తాయి.

 70 శాతం మేర

70 శాతం మేర

యూట్యూబ్ మ్యూజిక్ సేవ‌లు భార‌త్‌లో ప్రారంభం కావ‌డంతోపాటు మ‌రోవైపు జియో సావ‌న్‌, గానా వంటి మ్యూజిక్ యాప్‌లు కూడా త‌మ త‌మ యాప్ స‌బ్‌స్క్రిప్ష‌న్ చార్జిల‌ను 70 శాతం మేర త‌గ్గించాయి.

ఆపిల్ యూజ‌ర్లు

ఆపిల్ యూజ‌ర్లు

దీంతో ఆపిల్ కూడా త‌న మ్యూజిక్ యాప్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జిల‌ను త‌గ్గించింది. ఈ క్ర‌మంలో త‌గ్గించిన చార్జిల‌తో ఆపిల్ యూజ‌ర్లు యాపిల్ మ్యూజిక్ యాప్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ల‌ను పొంద‌వ‌చ్చు.

స‌బ్‌స్క్రిప్ష‌న్

స‌బ్‌స్క్రిప్ష‌న్

కాగా జియో సావ‌న్ యాప్ వార్షిక స‌బ్‌స్క్రిప్ష‌న్ అంత‌కు ముందు రూ.999 ఉండ‌గా, ఇప్పుడ‌ది రూ.299కే ల‌భిస్తున్న‌ది. అలాగే గానా వార్షిక ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ అంత‌కు ముందు రూ.1198 ఉండ‌గా ఇప్పుడ‌దిది కూడా రూ.299కే ల‌భిస్తున్న‌ది.

నెలవారీ ప్లాన్లు

నెలవారీ ప్లాన్లు

వీటి నెలవారీ ప్లాన్లు కూడా రూ.99 నుంచి ప్రారంభమవుతున్నాయి . స్పోటి ఫై ప్లాన్స్ రూ.119 నుంచి ప్రారంభమవుతుండగా, ఒక నెల ఉచిత ట్రయల్ ప్యాక్ అందిస్తోంది. వివిధ యాప్స్ మధ్య నెలకొన్న పోటీ మూలంగా తక్కువ ధరకే ఇవి అందుబాటులోకి వస్తున్నాయి .

విద్యార్థులకైతే రూ. 49కే

విద్యార్థులకైతే రూ. 49కే

ఇప్పటికే ‘యూట్యూబ్ మ్యూజిక్', ‘స్పోటి ఫై' వంటి సంస్థలు గట్టి పోటీ ఇస్తుండటాన్నిదృష్టిలో పెట్టుకుని ఆపిల్ ఈ ధరల్ని నిర్ణయించింది. నెలకు రూ.99లకే సబ్ స్ర్కిప్షన్ అందిస్తోంది. విద్యార్థులకైతే 49 రూపాయలకే నెలవారీ ప్యాకేజ్ ఇస్తోంది. రూ.149కి ఫ్యామిలీ ప్లాన్ అందిస్తోంది. ఫ్యామిలీప్యాక్ ని ఆరుగురు వాడుకోవచ్చు. ఫ్యామిలీ ప్యాక్ లో ‘ఐట్యూన్స్' కూడా షేర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Apple Music is now cheaper in India, starts at Rs 49 monthly for students

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X