మార్కెట్ లోకి ఆసుస్ Zenfone 6 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ మరియు ధరలు

తైవాన్స్ కంప్యూటింగ్ దిగ్గజం గురువారం స్పెయిన్లో ప్రెస్ ఈవెంట్లో కొత్త జెన్ఫోన్ 6 స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. సంస్థ గత సంవత్సరం రిలీజ్ చేసిన ZenFone 5Zకి అప్గ్రేడ్ గా ఈ ఫోన్ ను సెట్ చేసారు.

|

తైవాన్స్ కంప్యూటింగ్ దిగ్గజం గురువారం స్పెయిన్లో ప్రెస్ ఈవెంట్లో కొత్త జెన్ఫోన్ 6 స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. సంస్థ గత సంవత్సరం రిలీజ్ చేసిన ZenFone 5Zకి అప్గ్రేడ్ గా ఈ ఫోన్ ను సెట్ చేసారు. ఆసుస్ ZenFone 6 రొటేటింగ్ కెమెరా తో వస్తున్న సంస్థ యొక్క మొదటి స్మార్ట్ఫోన్. బెజెల్లను తగ్గించి అన్ని స్క్రీన్ ముందు వైపు అందించే ప్రయత్నంలో సంస్థ ఫ్లిప్పింగ్ కెమెరాను ఎంపిక చేసింది. ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది ఇది సాధారణంగా వెనుక భాగంలో ఉంటుంది అయితే సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం అవసరమైనప్పుడు దీనిని ముందుకు తిప్పవచు.

 
asus zenfone 6 launched globally price specifications cameras

ఈ స్మార్ట్ ఫోన్ లో USB- సి పోర్ట్ ప్రక్కన దిగువ భాగంలో 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఉంటుంది.అంతే కాకుండా ఫోన్ యొక్క కుడి వైపున స్మార్ట్ కీ కూడా గమనించవచ్చు.ఇది వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్తో ఉంటుంది. ఫోన్ యొక్క ఎడమ వైపున SIM మరియు మైక్రో SD కార్డుల కోసం ట్రిపుల్ స్లాట్లు ఉంటాయి.

 
asus zenfone 6 launched globally price specifications cameras

స్పెసిఫికేషన్స్ :

* డిస్ప్లే: ZenFone 6 6.4-inch ఫుల్ HD +డిస్ప్లే తో వస్తుంది.ఇది పూర్తిగా సన్నని బెజెల్ మరియు వంగిన
మూలలతో IPS LCD స్క్రీన్ తో వస్తుంది.

* ప్రాసెసర్ : ZenFone 6 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ శక్తి చేత పనిచేస్తుంది.

* RAM : ZenFone 6 మొబైల్ 6GB లేదా 8GB RAMతో వస్తుంది.

* స్టోరేజీ : ఇది 64GB, 128GB or 256GBఇంటర్నల్ స్టోరేజీలతో అందుబాటులో ఉంటుంది.
* కెమెరా : ది జెన్ఫోన్ 6 వెనుక వైపు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కలయికతో 13 మెగాపిక్సెల్ వైడ్-కోన్ కెమెరాతో ఉంటుంది. బ్యాక్
సైడ్ కెమెరా సోనీ IMX586 సెన్సార్ తో వస్తుంది. సెల్ఫీలను తీసుకోవటానికి మరియు వీడియో కాల్స్ చేయటానికి వెనుక
కెమెరాలు ముందు వైపుకు తిరగడానికి వీలుగా ఉంటాయి.

* బ్యాటరీ : ZenFone 6 త్వరిత 4.0ఛార్జ్ తో 5000 mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.

* సాఫ్ట్వేర్ :ఇది కొత్త ZenUI 6 ఆదారిత ఆండ్రాయిడ్9 పై సాఫ్ట్వేర్ ద్వారా పని చేస్తుంది.

asus zenfone 6 launched globally price specifications cameras

ఆసుస్ Zenfone 6 వేరియంట్స్ మరియు ధరలు :

ZenFone 6 ట్విలైట్ సిల్వర్ మరియు మిడ్నైట్ బ్లాక్ వంటి రెండు రంగుల వైవిధ్యాలలో అందుబాటులో ఉంటుంది.

1. 6GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ Euro 499 (సుమారుగా Rs39,000).
2. 6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ Euro559 (సుమారుగా Rs44,000).
3. 8GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ Euro599 (సుమారుగా Rs 47,000). ఆసుస్ ఈ మొబైల్ లను ఇండియాలో కూడా రిలీజ్ చేయాలి అని చూస్తోంది కానీ ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ ఈ నెల చివరికి ఇండియాకు రానున్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
asus zenfone 6 launched globally price specifications cameras

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X