ల్యాప్‌టాప్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మీకు అవసరమయ్యే టూల్స్...

|

ల్యాప్‌టాప్‌లు అనేవి ప్రస్తుతం మన జీవితంలో అంతర్భాగమైపోయాయి. హైబ్రిడ్ వర్క్ కల్చర్‌తో పాటు ఆన్‌లైన్ లెర్నింగ్‌ అందుబాటులోకి రావడంతో వీటి యొక్క అవసరం మరింత ఎక్కువ అయ్యాయి. ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు వినోదం కోసం కూడా అధికంగా ఉపయోగిస్తున్నారు. మీరు మీ ల్యాప్‌టాప్‌ను దేని కోసం ఉపయోగించినప్పటికీ మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు మీ ల్యాప్‌టాప్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి కొన్ని యాక్సెసరీలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు మీ యొక్క పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయగల కొన్ని ల్యాప్‌టాప్ ఉపకరణాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

స్టైలస్ పెన్ టూల్

స్టైలస్ పెన్ టూల్

స్టైలస్ అనేది టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే సపోర్ట్‌తో ల్యాప్‌టాప్‌ల కోసం అందుబాటులో గల పెన్ లాంటి డివైస్. ఇది వ్రాయడానికి, డూడుల్ చేయడానికి మరియు ఏదైనా బొమ్మలు గీయడానికి వంటి మరిన్నిటిని చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే చాలా ల్యాప్‌టాప్‌లు స్టైలస్ బండిల్‌తో రావు. కాబట్టి మీరు టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో గల ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తుంటే కనుక థర్డ్-పార్టీ స్టైలస్‌ని కొనుగోలు చేయడం మంచిది.

USB-ఆధారిత లాంప్స్

USB-ఆధారిత లాంప్స్

USB-పవర్డ్ LED ల్యాంప్స్ అనేవి ప్రస్తుతం తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. కరెంటు ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా రాత్రి సమయాలలో పక్కవారికి ఇబ్బంది కలిగించకుండా ఏదైనా చదవడానికి వీలుగా మంచి వెలుతురును అందిస్తాయి. ఇవి మీ కీబోర్డ్‌కు 'బ్యాక్‌లిట్'గా కూడా పని చేయవచ్చు.

 

 

యాంటీ గ్లేర్ ఫిల్టర్‌లు
 

యాంటీ గ్లేర్ ఫిల్టర్‌లు

ల్యాప్‌టాప్‌లను అధిక సమయం పాటు వినియోగించే వారు తరచుగా కళ్లకు సంబందించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సాధారణంగా ల్యాప్‌టాప్‌లు అన్ని కూడా కాళ్ళపై కఠినంగా ఉండే కాంతిని విడుదల చేస్తాయి. దీన్ని తగ్గించడానికి మీరు మీ స్క్రీన్ పైభాగంలో యాంటీ-గ్లేర్ ఫిల్టర్‌లను జోడించవచ్చు. ఇది స్క్రీన్ నుండి ప్రతిబింబాలను తగ్గించడమే కాకుండా కంటెంట్‌ను బయట కూడా స్పష్టంగా చూడడంలో సహాయపడుతుంది.

ల్యాప్‌టాప్ పవర్ బ్యాంక్

ల్యాప్‌టాప్ పవర్ బ్యాంక్

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ బ్యాక్ అప్ ని మంచిగా కలిగి ఉన్నప్పటికీ కరెంటు సమస్యలు ఉన్న ప్రాంతాలలో నివసించే వారు అధిక సమయం పని చేయాల్సి వచ్చినప్పుడు ఛార్జింగ్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి మీరు ల్యాప్‌టాప్‌లను ఛార్జ్ చేయడం కోసం పవర్ బ్యాంక్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది మీ ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పిన్‌కు అనుకూలంగా ఉండి కనీసం 10000mAh బ్యాటరీని కలిగి ఉందని నిర్ధారించుకోండి.

USB టైప్-C హబ్

USB టైప్-C హబ్

ఆధునిక ల్యాప్‌టాప్‌లు ప్రత్యేకించి మ్యాక్‌బుక్ ఎయిర్, HP స్పెక్టర్ X360 వంటి సన్నని మరియు తేలికపాటి ల్యాప్‌టాప్‌లు తక్కువ USB టైప్-C పోర్ట్‌లతో వస్తాయి. అంటే మీరు ఇతర USB పరికరాలు లేదా ఈథర్‌నెట్ కేబుల్ లేదా HDMIని ఉపయోగించాలని చూస్తున్నట్లయితే కనుక అటువంటి ఎంపిక ఏదీ వీటిలో ఉండవు. అయితే ఒక సాధారణ USB టైప్-C హబ్ ఈ సమస్యను పరిష్కరించగలదు. ఇది బహుళ పరిమాణాలలోని అన్ని రకాల పోర్ట్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి.

ల్యాప్‌టాప్ ఫిజికల్ సెక్యూరిటీ లాక్

ల్యాప్‌టాప్ ఫిజికల్ సెక్యూరిటీ లాక్

మీరు బయట ప్రాంతాలు ఉదాహరణకు కేఫ్, రెస్టారెంట్ లేదా హాస్టల్ వంటి వసతిలో నివసించాలని చూస్తున్నప్పుడు ల్యాప్‌టాప్ దొంగలించే అవకాశం అధికంగా ఉంటుంది. అటువంటి సమయాలలో ఫిజికల్ సెక్యూరిటీ లాక్ అనేది తాళాలుగా ఉపయోగపడతాయి. ఇది మీ ల్యాప్‌టాప్‌లను దొంగిలించకుండా రక్షించడంలో సహాయపడతాయి.

Best Mobiles in India

English summary
Best Tools You Need to Improve Your Laptop Experiences

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X