Postpaid Add-On కనెక్షన్ మీద రూ.50 పెంచిన ఎయిర్‌టెల్

|

భారతి ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ యొక్క ప్రయోజనాన్ని తొలగించింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ మరొక అడుగు ముందు వేసి తన పోస్ట్‌పెయిడ్ యాడ్-ఆన్ కనెక్షన్ సర్వీసులో పెద్ద మార్పులను తీసుకువచ్చింది.

 

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్

ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు నెలకు 199 రూపాయల చొప్పున యాడ్-ఆన్ కనెక్షన్‌ను జోడించడం ద్వారా ప్యామిలీ కనెక్షన్‌ను సృష్టించడానికి అనుమతించింది. అయితే ఈ యాడ్-ఆన్ కనెక్షన్ యొక్క ధరను ఇప్పుడు రూ.249 కు పెంచారు. క్రొత్త మార్పు ఇప్పటికే అమలులోకి వచ్చింది. ఈ మార్పు గురించి వినియోగదారులకు SMSల రూపంలో తెలియజేయబడుతుంది. మీరు ఎయిర్టెల్ యాడ్-ఆన్ కనెక్షన్ ఉన్నవారు అయితే ఛార్జీలు ఆటోమ్యాటిక్ గా మార్చబడతాయి.

 

 

WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?

భారతి ఎయిర్‌టెల్

ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు రెండు యాడ్-ఆన్ ఎంపికలను అందిస్తోంది. అవి వరుసగా సాధారణ యాడ్-ఆన్ మరియు కేవలం డేటా యాడ్-ఆన్ మాత్రమే. టెల్కోలో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు యాడ్-ఆన్ కనెక్షన్‌లలో రూ.749 ధర నుండి ప్రారంభమవుతాయి.

 

 

BSNL భారత్ ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ ఈ రాష్ట్రాలలో ప్రారంభమైంది....BSNL భారత్ ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ ఈ రాష్ట్రాలలో ప్రారంభమైంది....

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యాడ్-ఆన్ కనెక్షన్ ధర రూ .249 కు పెరిగింది
 

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యాడ్-ఆన్ కనెక్షన్ ధర రూ .249 కు పెరిగింది

భారతి ఎయిర్‌టెల్ 2017 లో మై ఫ్యామిలీ సేవను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులను ఫ్యామిలీని సృష్టించడం ద్వారా వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై 25% ఛార్జీలను ఆదా చేయడానికి వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు రూ.499 ప్లాన్‌పై ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు నెలకు రూ.499 ఖర్చయ్యే వ్యక్తిగత కనెక్షన్ కోసం వెళ్లే బదులు రూ.249 విలువైన యాడ్-ఆన్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు టెల్కో రెగ్యులర్ యాడ్-ఆన్ కోసం రూ.199 మరియు డేటా యాడ్-ఆన్ కోసం రూ.99 వసూలు చేస్తుఉండేది.

 

 

Jio,Vodafone,Airtel: రోజుకు 2GB డేటాను అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లుJio,Vodafone,Airtel: రోజుకు 2GB డేటాను అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు

 

 

యాడ్-ఆన్ కనెక్షన్

యాడ్-ఆన్ కనెక్షన్

ఏదేమైనా తాజా పెరుగుదల తరువాత డేటా యాడ్-ఆన్ ధర అదే విధంగా ఉంది కానీ సాధారణ యాడ్-ఆన్ ధర మీద రూ.50 పెంచడంతో దీని యొక్క ధర ఇప్పుడు 249 రూపాయలకు చేరింది. యాడ్-ఆన్ కనెక్షన్‌కు అదనంగా 18% GST కూడా వర్తిస్తుందని గమనించండి. కాబట్టి యాడ్-ఆన్ కనెక్షన్ ను ఎంచుకున్న వినియోగదారుడు ప్రతి నెలా తమ ప్లాన్ కింద రూ.499 + రూ.249 + 18% GST చెల్లించవలసి ఉంటుంది.

 

 

Airtel Wi-Fi Callingతో ఫోన్ కాల్ డ్రాప్‌లకు చెక్...Airtel Wi-Fi Callingతో ఫోన్ కాల్ డ్రాప్‌లకు చెక్...

ఎయిర్‌టెల్ యాడ్-ఆన్ కనెక్షన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ యాడ్-ఆన్ కనెక్షన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ యాడ్-ఆన్ వినియోగదారులకు 10GB ఉచిత డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లను అందిస్తుంది. అయినప్పటికీ మొదటి కనెక్షన్ యొక్క డేటా ప్రయోజనాన్ని ఎటువంటి పరిమితి లేకుండా వినియోగించవచ్చు.

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు Vs వ్యక్తిగత యాడ్-ఆన్‌ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు Vs వ్యక్తిగత యాడ్-ఆన్‌ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు బండిల్ యాడ్-ఆన్ కనెక్షన్‌లతో అందిస్తోంది. ఎయిర్‌టెల్ యొక్క రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రెగ్యులర్ యాడ్-ఆన్ మరియు ఒక డేటా యాడ్-ఆన్‌తో వస్తుంది. ఇది మొత్తంగా ఒక దాని మీద మూడు కనెక్షన్‌లను అందిస్తుంది. మూడు కనెక్షన్ల కోసం మొత్తం నెలవారీ ఛార్జీలు రూ.749 + 18% GST గా వసూలు చేయబడతాయి. అయితే మీరు బేస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఒక్కొక్కటిగా అదే యాడ్-ఆన్‌ను ఎంచుకుంటే ఛార్జీలు రూ.499 + రూ.249 + రూ.99 + 18% GST గా చెల్లించవలసి ఉంటుంది. దీనిని మీరు సరిగ్గా గమనించినట్లు అయితే ఎయిర్టెల్ ఫ్యామిలీ ప్లాన్‌లు వ్యక్తిగత యాడ్-ఆన్ కనెక్షన్ల కంటే చాలా వరకు మెరుగ్గా ఉన్నాయి.

 

 

Best Mobiles in India

English summary
Bharti Airtel Postpaid Add-On Price Now Start at Rs.249

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X