BSNL ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.2.4 లక్షలు ఖర్చు చేసారు!! ప్రత్యేకత ఏమిటో

|

భారత ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఏకైక టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలో అత్యంత ఆకర్షణీయమైన టెలికాం ఆపరేటర్ కాకపోవచ్చు కానీ దాని VIP లేదా ఫ్యాన్సీ నంబర్‌లు మాత్రం భారతదేశంలోని పౌరులలో చాలా ఆసక్తిని కలిగి ఉన్నాయి. VIP లేదా ఫ్యాన్సీ నంబర్‌లు నిజంగా ఎలాంటి అదనపు ప్రయోజనాలతో రావు. కానీ వాటిని గుర్తుంచుకోవడం చాలా సులభం తప్ప మరేమీ ఉపయోగం లేదు. ఇటీవల జరిగిన పరిణామంలో రాజస్థాన్‌లోని కోటకు చెందిన బంగాళాదుంప వ్యాపారి BSNL యొక్క ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌ను బిడ్ చేశాడు. ఇందులో గొప్ప ఏమిఉంది అని ఆలోచిస్తున్నారా?? ఇందుకోసం అతను ఏకంగా రూ.2.4 లక్షలు చెల్లించి కొనుగోలు చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫోన్ నంబర్ కోసం చెల్లించిన అధిక మొత్తం కావడం అది కూడా ముఖ్యంగా BSNL నెంబర్ కోసం వెచ్చించడం అనేది విడ్డురంగా ఉంది కదూ. కొన్ని డైలీ నివేదిక ప్రకారం వ్యక్తి వేలం వేసిన VIP నంబర్ - XXX7000000.

 

ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా BSNL VIP నంబర్‌లు

ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా BSNL VIP నంబర్‌లు

BSNL యొక్క VIP నంబర్‌లు దాని వెబ్‌సైట్‌లో "ఫ్యాన్సీ నంబర్స్ వేలం" వర్గం విభాగం క్రింద అందుబాటులో ఉన్నాయి. XXX7000000 నంబర్ కోసం ఆక్షన్ రూ.20,000 వద్ద ప్రారంభమైంది. అయితే ఇది ఒక్కసారిగా రూ.2,00,000లకు దాటింది. ఈ నెంబర్ కోసం కోటకు చెందిన బంగాళాదుంప వ్యాపారి అగ్రస్థానంలో నిలిచాడు. బంగాళదుంపల వ్యాపారి పేరు తనూజ్ దూదేజా. నివేదికల ప్రకారం విజేత ఫరూఖాబాద్‌లోని BSNL కార్యాలయం నుండి VIP నంబర్‌ను సేకరించాడు. DNAIndia నివేదిక ప్రకారం దూదేజా కలిగి ఉన్న మొదటి VIP లేదా ఫ్యాన్సీ నంబర్ ఇది కాదు. సదరు వ్యక్తి గతంలో మరో ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.1,00,000 లేదా రూ.లక్ష చెల్లించి కొనుగోలు చేయడం మరొక విషయం.

అమెజాన్ ప్రైమ్ 'క్లిప్-షేరింగ్' కొత్త ఫీచర్!! వీడియో క్లిప్‌లను షేర్ చేయవచ్చుఅమెజాన్ ప్రైమ్ 'క్లిప్-షేరింగ్' కొత్త ఫీచర్!! వీడియో క్లిప్‌లను షేర్ చేయవచ్చు

VIP నంబర్‌
 

సిమ్ కార్డ్ నంబర్ కోసం లక్షల రూపాయలు చెల్లించే వ్యక్తులను చూడటం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. అది కూడా భారతదేశంలో నిజంగా 4G ఉనికిని కలిగి లేని ప్రభుత్వరంగ టెల్కో నుండి ఆ నెంబర్ ఉన్నప్పుడు మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విపరీతమైన మొత్తానికి VIP నంబర్‌ను కొనుగోలు చేయడం అనేది ప్రైవేట్ టెల్కోలలో ఒకదాని నుండి అయితే అర్ధమే అని చెప్పలేము. మీరు ఇష్టపడితే BSNL వెబ్‌సైట్‌లో వేలం వేయడానికి మరిన్ని VIP నంబర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏ సెల్ ఫోన్ నంబర్ అయినా, అది VIP లేదా ఫ్యాన్సీ అయినా ప్రజలు దాని కోసం వేలం వేసే డబ్బు మొత్తాన్ని సమర్థించదు.

Amazonలో ఒప్పో స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...Amazonలో ఒప్పో స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

BSNL 4G సిమ్ ఫ్రీ ఆఫర్

BSNL 4G సిమ్ ఫ్రీ ఆఫర్

BSNL యొక్క కొత్త సిమ్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మరియు ఇతర ఆపరేటర్ల నుండి BSNL నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసే వారికి ఇప్పుడు ఉచితంగా 4G సిమ్ కార్డులను సంస్థ అందిస్తోంది. ప్రారంభంలో ఈ ఆఫర్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించబడింది. తరువాత ఇది సెప్టెంబర్ వరకు ఆఫర్‌ను పొడిగించింది. ఇప్పుడు ఈ ఆఫర్ డిసెంబర్ వరకు పొడిగించబడినట్లు సంస్థ నివేదించింది. సాధారణంగా BSNL యొక్క 4G SIM కార్డ్ రూ.20 ధర వద్ద లభిస్తుంది. ఇది కొత్త వినియోగదారులకు మరియు MNP పోర్ట్ వినియోగదారులకు రూ.100 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మినహాయించబడుతుంది. ఈ BSNL ఉచిత 4G సిమ్ ఆఫర్ BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్స్ (BSNL) మరియు రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా పొందవచ్చు. ఉచిత 4G సిమ్ ఆఫర్‌తో పాటు BSNL తన రూ.699 ప్రమోషనల్ ప్లాన్ వాలిడిటీని 90 రోజుల పాటు పొడిగించింది. టెల్కో ఈ ప్రమోషనల్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో 180 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్ సెప్టెంబర్ 28 తో ముగుస్తుంది. కానీ టెల్కో దీనిని మరో 90 రోజులు పొడిగించింది. రూ.699 ప్రమోషనల్ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాలు రోజుకు 0.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రోమో ప్లాన్ జనవరి 2022 వరకు చెల్లుతుంది.

బిఎస్ఎన్ఎల్ హైబ్రిడ్ 4G ప్లాన్స్

బిఎస్ఎన్ఎల్ హైబ్రిడ్ 4G ప్లాన్స్

4G రోల్ అవుట్ కోసం భారతీయ కంపెనీలపై విదేశీ అమ్మకందారులకు ప్రాధాన్యత ఇవ్వడంపై టెల్కోను ప్రశ్నించినప్పటి నుండి బిఎస్ఎన్ఎల్ దాని కోసం ఒక తెలివైన పరిష్కారంతో ముందుకు వచ్చింది. ప్రభుత్వ-టెల్కో హైబ్రిడ్ 4G టెండర్‌ను ప్రతిపాదించింది. ఇందులో భారతీయ మరియు విదేశీ కంపెనీలు ఉంటాయి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoC) తో భారతీయ కంపెనీలు రావడానికి బిఎస్ఎన్ఎల్ కు సమయం లేదు. ఆ విధంగా టెల్కో టెండర్‌ను రెండు భాగాలుగా విభజించాలని ప్రతిపాదించింది. మొదటి భాగం 50,000 సైట్లు భారతీయ విక్రేతలకు మరియు మిగిలిన 57,000 భాగాలను విదేశీ అమ్మకందారులకు కేటాయించబడుతుంది. బిఎస్ఎన్ఎల్ యొక్క సరికొత్త వ్యూహంతో 57,000 సైట్లలో విదేశీ అమ్మకందారులతో పనిచేయడం ప్రారంభించవచ్చు. అప్పటి వరకు భారతీయ కంపెనీలు PoCని రూపొందించడానికి పని చేయవచ్చు. ఏదేమైనా ఏ భారతీయ కంపెనీ అయినా సకాలంలో PoCని ఉత్పత్తి చేయగలిగితే కనుక విదేశీ అమ్మకందారుల కోసం కేటాయించిన 57,000 సైట్లలో కూడా ఇది ఒక భాగమని ప్రభుత్వ టెల్కో హామీ ఇచ్చింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Fancy Number Bidding For Rs.2.4 Lakh in Online portal Auction

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X