ఏ నెట్‌వర్క్‌‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ !

Written By:

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు నానాపాట్లు పడుతున్న ఇతర టెలికం కంపెనీలు భారీ ఆఫర్లతో దిగివస్తున్న వేళ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా తమ ఖాతాదారులకు బంపరాఫర్ ప్రకటించింది. జనవరి నుంచి అన్ లిమిటెడ్ కాల్స్ తో రానున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.
Bsnl మరో ఆఫర్..అన్‌లిమిటెడ్ కాల్స్, 3జీ డేటా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెలవారీ పథకాలను

ఏ నెట్ వర్క్కు అయినా అపరిమిత కాల్స్కు వీలు కల్పించే నెలవారీ పథకాలను బీఎస్ఎన్ఎల్ తీసుకురానుంది. ఉచిత డేటాతో కలుపుకుని ఈ ప్లాన్ ధర రూ .149 గా ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లోకల్, ఎస్టీడీ

ఏ నెట్వర్క్కు అయినా లోకల్, ఎస్టీడీ అపరిమిత కాల్స్తోపాటు కొంత ఉచిత డేటాతో కలుపుకుని రూ .149 లేదా అంతకంటే తక్కవకే వచ్చే నెల నుంచి ఓ పథకాన్ని తీసుకురానున్నట్టు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

నాలుగో స్థానానికి

బిఎస్ఎన్ఎల్ పునరుద్ధాన దిశలో ఉందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, నిర్వహణ లాభాలను ఆర్జిస్తున్నామని శ్రీవాస్తవ వెల్లడించారు. 'ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్నాం'. తర్వాత ఆరో స్థానికి పడిపోయాం. ఇప్పుడు తిరిగి నాలుగో స్థానానికి చేరుకున్నాం '' అని ఆయన వివరించారు.

10 శాతం కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వెంట

ప్రస్తుతం 10 శాతం కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వెంట ఉన్నారని, 15 శాతానికి పెంచుకునే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వాయిస్ కాల్స్ బస్ చేజారిపోయిందని, డేటా వ్యాపార బస్ మాత్రం చేజారనివ్వమన్నారు. ల్యాండ్లైన్ వ్యాపారంపైనా దృష్టి పెట్టామని చెప్పారు.

జనవరి 1 నుంచి ఈ పథకాన్ని

జనవరి 1 నుంచి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
BSNL to offer unlimited voice calls to all networks read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot