CoWIN app:కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం యాప్ లో రిజిస్టర్ అవ్వడం ఎలా?

|

ఇండియాలో కరోనా ప్రభావం మొదలై చాలా రోజులు అయింది. కొన్ని రోజుల నుంచి కోవిడ్ -19 వ్యాక్సిన్ల గురించి చాలానే వార్తలు బయటకు వస్తున్నాయి. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుంచి రెండు కోవిడ్ -19 వ్యాక్సిన్లకు ఆమోదం లభించిన తరువాత ఇప్పుడు అత్యవసర వినియోగానికి పంపిణి చేయడం మొదలుకానున్నది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు భారత్ బయోటెక్ సంస్థలు రెండు కూడా కరోనా మొదటి దశ టీకాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా అందరి కంటే ముందు ఫ్రంట్లైన్ కార్మికులు మరియు 50 ఏళ్లు పైబడిన వారికి అందించాలని ఆలోచనలో ఉన్నారు. తదుపరి టీకా ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం కోవిన్ (కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ వర్క్) అనే అప్లికేషన్ ను ప్రవేశపెట్టింది.

కోవిన్ యాప్ డిజిటలైజ్డ్ వేదిక
 

కోవిన్ యాప్ డిజిటలైజ్డ్ వేదిక

ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 2020 డిసెంబర్ 23 న కోవిన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కొత్త యాప్ ను తయారుచేయమని ప్రకటించారు. ఇది దేశంలో వ్యాక్సిన్‌ను పంపిణిచేయడానికి డిజిటలైజ్డ్ వేదికగా ఉంటుంది. పోటీదారులలో మొదటి మరియు రెండు విజేతలకు వరుసగా రూ .40 లక్షలు, రూ .20 లక్షలు నగదు బహుమతిని కూడా ప్రకటించాడు. అందులో భాగంగా మొదటి బహుమతిని అందుకున్నది కోవిన్ యాప్.

CoWin app లభ్యత

CoWin app లభ్యత

కోవిన్ యాప్ దేశంలో పనిచేయడం ఇంకా మొదలుకాలేదు. కావున ఎవరైనా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి ఈ రకమైన యాప్ ను డౌన్‌లోడ్ చేసి ఉంటే అది ఖచ్చితంగా పనిచేయదు. మీరు అలాంటి యాప్ లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలి లేదా మీ యొక్క వ్యక్తిగత డేటాను అందివ్వకుండా అయినా ఉండాలి. ఈ అప్లికేషన్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్ట్ దశలో ఉంది. టీకాలు వేయడానికి మొదటి స్థానంలో ఉన్న ఆరోగ్య అధికారుల డేటా మాత్రమే ప్రస్తుతం ఇందులో ఉంది. ఇప్పటికే 75 లక్షల మంది ఆరోగ్య అధికారులు ఇందులో నమోదు చేసుకున్నారు.

కోవిన్ యాప్ లో రిజిస్టర్ అవ్వడం ఎలా?

కోవిన్ యాప్ లో రిజిస్టర్ అవ్వడం ఎలా?

కరోనావైరస్ మహమ్మారి కోసం రాబోయే వ్యాక్సిన్ కోసం సాధారణ ప్రజలు ప్రస్తుతం నమోదు చేయలేరు. ఎందుకంటే ప్రస్తుతానికి అధికారులు మాత్రమే దీనిని పొందడానికి యాక్సిస్ ను కలిగి ఉన్నారు. ఈ యాప్ రన్ అయిన తర్వాత ఇందులో యూజర్ అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, లబ్ధిదారుల నమోదు, టీకా మరియు లబ్ధిదారుల రసీదు మరియు స్టేటస్ అప్ డేట్ వంటి నాలుగు మాడ్యూల్స్ ఉంటాయి.

కోవిన్ వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ ఎంపిక
 

కోవిన్ వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ ఎంపిక

వ్యాక్సిన్ టీకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కోవిన్ యాప్ లేదా వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ ఎంపిక కోసం సెల్ఫ్-రిజిస్ట్రేషన్, వ్యక్తిగత రిజిస్ట్రేషన్ మరియు బల్క్ అప్‌లోడ్‌ వంటి మూడు రిజిస్ట్రేషన్ ఎంపికలు ఉన్నాయి. అయితే దాని లాజిస్టిక్స్ ఇంకా వెల్లడించలేదు. ప్రజలు వ్యాక్సిన్ ను పొందడానికి ప్రభుత్వం కొన్ని శిబిరాలను నిర్వహిస్తుంది. ఇందులో టీకా కోసం అధికారులు నమోదు చేసుకోవచ్చు. అదనంగా సర్వేయర్లు మరియు జిల్లా నిర్వాహకులు కూడా లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్నారు.

CoWIN నమోదు కోసం అవసరమైన డాక్యూమెంట్స్ & వ్యాక్సిన్ ధరలు

CoWIN నమోదు కోసం అవసరమైన డాక్యూమెంట్స్ & వ్యాక్సిన్ ధరలు

కోవిన్ యాప్ లో నమోదు చేసుకోవడానికి ప్రజలు ఫోటో ఐడి కార్డును అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ మరియు ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా సరే. ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఉచితంగా లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. సాధారణ ప్రజలకు అందించే వ్యాక్సిన్ యొక్క ధరను ఇంకా ప్రకటించలేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
CoWIN app: How to Register For The Covid-19 Vaccine in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X