షాక్, సిమ్‌కార్డ్ పనిచేయకపోతే రూ.5000 చెల్లించాలి

ఇంటర్నేషనల్ రోమింగ్ కార్డ్, గ్లోబల్ కాలింగ్ కార్డ్ ప్రొవైడర్లకు టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భారీ షాకిచ్చింది. విదేశీ ప్రయాణంలో ఉన్నపుడు అంతర్జాతీయ సిమ్ కార్డ్స్ ఫెయిల్ అయినట్లయితే ఆ కస్టమర్‌కు ఆయా టెలికం ప్రొవైడర్స్ రూ.5000 నష్టపరిహారం చెల్లించాలని ట్రాయ్ ప్రతిపాదనలు చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రీ-పెయిడ్ అలానే పోస్ట్-పెయిడ్ యూజర్లకు వర్తిస్తుంది

ఈ నష్టపరిహారం అనేది ప్రీ-పెయిడ్ అలానే పోస్ట్-పెయిడ్ యూజర్లకు వర్తిస్తుంది. ప్రీ-పెయిడ్ యూజర్లకు నష్టపరిహారంతో పాటు కనెక్షన్ నిమిత్తం చెల్లించిన ఫీజు కూడా వాపుసు వచ్చేస్తుంది. ఈ మొత్తాన్ని ఆయా ప్రొవైడర్లు 15 రోజుల్లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ట్రాయ్ సూచించింది.

10శాతం ఫెయిల్ అయితే లైసెన్సే రద్దు..

ప్రొవైడర్ ఇష్యూ చేస్తున్న ఇంటర్నేషనల్ రోమింగ్ కార్డ్స్‌లో 10శాతం ఫెయిల్ అయినట్లయితే ఆ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్‌నే రద్దు చేయాలని ట్రాయ్ సూచనలు చేసింది. అంతేకాకుండా ఇంటర్నెషల్ సిమ్ కార్డ్ విక్రేతలు ఓ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మెకినిజమ్ ను ఏర్పాటు చేసుకోవాలని సీఫార్స్ చేసింది. తద్వారా కస్టమర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించే అవకాశముంటుందని తెలిపింది.

డిజిటల్ మోడ్ ద్వారానే కొనుగోలు చేయాలి...

ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్స్ అలానే గ్లోబల్ కాలింగ్ కార్డులను డిజిటల్ మోడ్ ద్వారానే కొనుగోలు చేయాలని కోరింది. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, క్రిడిట్ కార్డ్ ఇంకా డెబిట్ కార్డ్స్, ఇ-వాలెట్ వంటి డిజిటల్ పద్ధతుల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరింది.

23 కంపెనీల పై వేటుకు సిద్ధం..?

ఇంటర్నేషనల్ రోమింగ్ కార్డ్స్, గ్లోబల్ కాలింగ్ కార్డ్స్ పనితీరును విశ్లేషించేందుకు ఇటీవల ట్రాయ్ చేపట్టిన ఎస్ఎంఎస్ ఆధారిత సర్వేలో దాదాపు సగం మంది వినియోగదారులు నెగిటివ్ రెస్పాన్స్ ను ఇచ్చినట్లు తేలటంతో ఇంటర్నేషనల్ రోమింగ్ కార్డ్, గ్లోబల్ కాలింగ్ కార్డ్ ప్రొవైడర్లతో చర్చలు నిర్వహించింది. ఈ చర్చలకు హాజరుకాని 23 కంపెనీల పై వేటు వేసేందుకు ట్రాయ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Customers may get Rs 5,000 if international SIM card fails. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot