ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.

By Maheswara
|

భారతదేశంలో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టం పై యాంటీట్రస్ట్ హియరింగ్‌తో గూగుల్ చాలా కష్టాలను ఎదుర్కొంటోంది మరియు ఇదే అదనుగా ఇతర భారతీయ డెవలపర్‌లు స్థానికంగా అభివృద్ధి చేసిన కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)తో రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. Google యొక్క ఆండ్రాయిడ్ OS అనేది భారతదేశంలో 95 శాతం కంటే ఎక్కువ పరికరాల లో రన్ అవుతున్న మొబైల్ OS. కానీ ఇటీవల, భారతదేశంలోని మేక్ ఇన్ ఇండియా చొరవతో సొంత మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ను IIT మద్రాస్ ద్వారా అభివృద్ధి చేసారు. ఈ OS ను BharOS అని పిలుస్తారు, ఇది మొబైల్ పరికరాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన OS.

 

BharOS అంటే ఏమిటి

BharOS అంటే ఏమిటి

ఈ OS యొక్క డెవలపర్లు ఇది సురక్షితమైనదని మరియు మన దేశంలోనే పూర్తిగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. కాబట్టి BharOS అంటే ఏమిటి, ఇది నిజంగా మొదటి నుండి అభివృద్ధి చేయబడిందా మరియు భారతదేశంలో Google వంటి దిగ్గజంతో పోటీపడేంత సత్తా ఉందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BharOS - స్థానికంగా అభివృద్ధి చెందిందా?

BharOS - స్థానికంగా అభివృద్ధి చెందిందా?

IIT మద్రాస్ వారిచే నిర్మించబడిన JandK ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (JandKops) అనే సంస్థ ద్వారా BharOS అభివృద్ధి చేయబడింది. ఇది మొబైల్ OS ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP)ని దాని బేస్ లేయర్‌గా ఉపయోగిస్తుంది, అంటే భారతదేశానికి చెందిన సంస్థ BharOSలో పనిచేసినప్పటికీ, ఇది పూర్తిగా దేశంలో తయారు చేయబడదు.

BharOS ఏమి ఫీచర్లు అందిస్తుంది?
 

BharOS ఏమి ఫీచర్లు అందిస్తుంది?

ఈ BharOS ద్వారా వినియోగదారులకు అవసరమైన యాప్‌లను ఎంచుకోవడానికి మరింత స్వేచ్ఛ, నియంత్రణ మరియు సౌలభ్యాన్నిఅందిస్తుందని ఈ OS వెనుక ఉన్న కంపెనీ పేర్కొంది. కాబట్టి దీని అర్థం ఏమిటంటే, ఈ OS ప్రత్యేక యాప్ స్టోర్ (ప్లే స్టోర్ లేదా గెలాక్సీ స్టోర్ వంటివి) లేకుండా వస్తుంది మరియు వినియోగదారులకు వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి యాప్‌లను డౌన్‌లోడ్/సైడ్‌లోడ్ చేయడానికి స్వేచ్ఛ ఉంటుంది.  BharOSని అమలు చేస్తున్న పరికరానికి ఎటువంటి భద్రతా వ్యవహారాలలో నుండి సురక్షితంగా ఉండేలా క్రమమైన భద్రతా అప్డేట్ లను కలిగి ఉంటుందని ఈ సంస్థ హామీ ఇస్తుంది. దీనికి అదనంగా, BharOS లో ప్రీలోడెడ్ చేసిన యాప్‌లను అందించదు మరియు సంస్థ OSలో ఉపయోగించడానికి వెట్ చేసిన యాప్‌ల జాబితాను కలిగి ఉంది.

మీరు మీ ఫోన్‌లో BharOS ని అప్డేట్ చేయవచ్చా?

మీరు మీ ఫోన్‌లో BharOS ని అప్డేట్ చేయవచ్చా?

BharOS మొదటగా Android (AOSP)పై ఆధారపడి ఉన్నప్పటికీ, మీరు ఇప్పటికే ఆండ్రాయిడ్ OS ఉన్న పరికరాల్లో ఈ కొత్త OS అప్డేట్ ను ఇన్స్టాల్ చేయడం వీలుపడదు. Google అనేక సంవత్సరాలుగా ఫోన్ భాగస్వాముల ద్వారా తన Play Store పర్యావరణ వ్యవస్థను అందిస్తోంది మరియు భారతదేశంలోని మొబైల్ వినియోగదారుల మధ్య తన పరిధిని పెంచుకోవాలంటే BharOS  కి ఇదే విధమైన వ్యవస్థ ఏర్పాటు అవసరం ఉంటుంది . JandKops సంస్థ లోని వ్యక్తులు మరిన్ని పరికరాలలో BharOS ని అప్డేట్ చేయడానికి ప్రభుత్వ ఏజెన్సీలు మరియు ప్రైవేట్ పరిశ్రమలతో జట్టుకట్టాలని చూస్తున్నారు.

గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌

గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌

ఇది ఇలా ఉండగా, గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. దీనికి కొనసాగింపుగా, ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా తన ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ OS ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై పనిచేయడం ప్రారంభించింది. ఇది నోటిఫికేషన్ అనుమతులు, యాప్ భాష ప్రాధాన్యతల పరంగా చాలా అప్‌డేట్ చేయబడుతుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Education Minister Tests Made In India Mobile Operating System BharOS. Will It Compete Against Android And iOS?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X