స్టార్టప్ ఇండియా – వాట్సాప్ గ్రాండ్ ఛాలెంజ్‌, గెలిస్తే రూ.1.8 కోట్లు మీ సొంతం

నిత్యం కొత్తదనం నిండిన ఆలోచనలతో ముందుకు సాగుతోన్న వాట్సాప్, భారత్‌లోని యువపారిశ్రామికవేత్తలను వృద్థిలోకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో స్టార్టప్ ఇండియా – వాట్సాప్ గ్రాండ్ ఛాలెంజ్‌ను అనౌన్స్ చేసింది.

|

నిత్యం కొత్తదనం నిండిన ఆలోచనలతో ముందుకు సాగుతోన్న వాట్సాప్, భారత్‌లోని యువపారిశ్రామికవేత్తలను వృద్థిలోకి తీసుకువచ్చే ఉద్దేశ్యంతో స్టార్టప్ ఇండియా – వాట్సాప్ గ్రాండ్ ఛాలెంజ్‌ను అనౌన్స్ చేసింది. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే అంకుర సంస్థలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు. ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన దరఖాస్తులను మార్చి 10వ తేదీ వరకు స్వీకరిస్తారు. పాల్గనాలనుకునే వారు (https://goo.gl/NAaM5d) ఈ లింక్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఫిబ్రవరి 14న మీ లవర్ ని గిఫ్ట్ తో ఇంప్రెస్ చేయడానికి బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ఈ ఫిబ్రవరి 14న మీ లవర్ ని గిఫ్ట్ తో ఇంప్రెస్ చేయడానికి బెస్ట్ బడ్జెట్ ఫోన్స్

ఈ ఛాలెంజ్‌లో భాగంగా

ఈ ఛాలెంజ్‌లో భాగంగా

ఈ ఛాలెంజ్‌లో భాగంగా హెల్త్ కేర్, రూరల్ ఎకానమీ, ఫైనాన్షియల్ అండ్ డిజిటల్ ఇంక్లూజన్, ఎడ్యుకేషన్, సిటిజన్ సేఫ్టీ అంశాలకు సంబంధించిన థీమ్‌లను మాత్రమే పరిగణంలోకి తీసుకుంటారు. ఇలా వచ్చిన ఆలోచనల్లో 30 బెస్ట్ ఆలోచనలను స్వతంత్ర సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఎంపిక చేసిన వాటిలో పదింటిని ఈ బృందం తుది సెలక్షన్స్‌లోకి తీసుకుంటుంది. అంతిమంగా ఐదు ఉత్తమ ఆలోచనలతో వచ్చిన అంకురాలను సెలక్ట్ చేసి వాటికి నగదు బహుమతులను ఇస్తుంది. ఒక్కో అంకురానికి 50వేల డాలర్ల చొప్పున, 250000 డాలర్లను ఈ ఛాలెంజ్‌లో భాగంగా అందిస్తుంది. మే 24వ తేదీన విజేతలను ప్రకటిస్తారు.

 

 

 

తాజా అప్‌డేట్‌లో భాగంగా వాట్సాప్

తాజా అప్‌డేట్‌లో భాగంగా వాట్సాప్

తాజా అప్‌డేట్‌లో భాగంగా వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ మరో మైలు రాయిని అందుకుంది. ఈ యాప్‌‌‌ను దాదాపు 50 లక్షలమంది యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్‌కు సంబంధించి వెబ్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసకువచ్చినట్లు సంస్థ వెల్లడించింది.

 

 

వాట్సప్‌ బిజినెస్‌

వాట్సప్‌ బిజినెస్‌

చిన్న వ్యాపార సంస్థల సౌకర్యం కోసం వాట్సప్‌ బిజినెస్‌' పేరుతో ఉచిత ఆండ్రాయిడ్‌ యాప్‌ ను గతేడాది వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీలు వ్యాపార కార్యకలాపాల దృష్ట్యా

తమ కస్టమర్లతో కనెక్ట్‌ అయ్యేందుకు ఈ యాప్‌

తమ కస్టమర్లతో కనెక్ట్‌ అయ్యేందుకు ఈ యాప్‌

తమ కస్టమర్లతో కనెక్ట్‌ అయ్యేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. 130 కోట్ల వాట్సప్‌ యూజర్లు వ్యాపార సంస్థలతో చాట్‌ చేయడం మరింత సులువు అవుతుందని కంపెనీ పేర్కొంది.

 

 

మీరు మీ మొబైల్ నుంచి

మీరు మీ మొబైల్ నుంచి

మీరు మీ మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి ఈ యాప్‌ని వాట్సప్ మాదిరిగానే డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కాగా ఈ యాప్ మీరు మరో నంబరుతో వాడుకోవచ్చు. వాట్సప్ బిజినెస్‌లో ల్యాండ్‌లైన్ నంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాట్సప్‌లో ఈ ఫీచర్ లేదు. ఎక్కువ మంది వ్యాపారస్తులు ల్యాండ్‌లైన్ నంబర్ యూజ్ చేస్తుండటంతో ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. మీరు వాట్సప్ బిజినెస్‌లో ఆటో రిప్లై ఫీచర్ సెట్ చేసుకోవచ్చు. బిజీగా ఉండి అవతలి వారికి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో రిప్లై సెట్ చేసుకోవచ్చు.

యాప్‌లో తమ వ్యాపారాలను నమోదుచేసుకున్నవారికి

యాప్‌లో తమ వ్యాపారాలను నమోదుచేసుకున్నవారికి

యాప్‌లో తమ వ్యాపారాలను నమోదుచేసుకున్నవారికి వెరిఫికేషన్ పూర్తైన తర్వాత వెరిఫైడ్ అంటూ గ్రీన్ కలర్ టిక్ వస్తుంది. కస్టమర్లతో మంచి సంబంధాలను నెరపడానికి.. వారు అడిగిన వాటికి త్వరగా రిప్లై ఇ్వవడానికి.. వారికి గ్రీటింగ్ మెసేజ్‌లు పంపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే కస్టమర్ల అనుమతితోనే వ్యాపారులు మెసేజ్‌లు పంపగలరు.

Best Mobiles in India

English summary
WhatsApp announces Startup India challenge; giving away Rs. 1.8 crore.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X