ఈ 5 పనులు చేస్తే మీ మొబైల్ సురక్షితంగా ఉంటుంది

By Gizbot Bureau
|

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. దీంతో మన దగ్గర ఉన్న టెక్ గ్రాడ్జెట్స్ ని హ్యాకర్లు ఈజీగా హ్యాక్‌ చేస్తున్నారు. హ్యాకింగ్ కోసం ఇప్పుడు అనేక రెడీమేడ్‌ టూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఆండ్రాయిడ్‌ లేదా ఐ ఫోన్లని హ్యాకింగ్‌ చేయడం సాధ్యమవుతోంది. అందులోని ప్రత్యేకమైన అప్లికేషన్‌ మనకు కనిపించకుండానే బ్యాక్‌గ్రౌండ్లో రన్‌ అయ్యే విధంగా ఇన్‌స్టాల్‌ చేస్తే హ్యాకింగ్‌ చేయొచ్చు. హ్యాకర్‌ వేరే ప్రదేశంలో ఉండి వివిధ రకాల సోషల్‌ ఇంజనీరింగ్‌ పద్ధతులు అనుసరించడం ద్వారా మన ఫోన్‌ హ్యాక్‌ చేస్తారు.అయితే హ్యాకింగ్‌ బారిన పడకుండా ఉండాలంటే, లింకులను క్లిక్‌ చేసే విషయంలో జాగ్రత్త పడాలి. ఆఫర్ల పేరుతో వచ్చే లింకులకు ఓపెన్ చేయకూడదు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అన్ని అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు. కొంతమంది యాంటీవైరస్‌ ఉంటే మంచిది అని భావిస్తుంటారు. మన ఫోన్‌లో యాంటీ వైరస్‌ ఉన్నా కూడా హ్యాకింగ్‌ పేలోడ్‌లను వాటిని గుర్తించలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఈ 5 పద్దతులను పాటిస్తే మీ ఫోన్ హ్యాక్ భారీన పడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

యాప్స్ విషయంలో జాగ్రత్త

యాప్స్ విషయంలో జాగ్రత్త

గూగుల్‌కు సైతం నకిలీ యాప్స్ పెద్ద సమస్యగా మారిపోయింది. అలాంటి యాప్స్ అన్నీ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నాయి. ఏవి అసలో, ఏవి నకిలీవో తెలియక యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో పరిశోధకుల నివేదిక ప్రకారం 85 యాడ్‌వేర్ యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. వాటిలో గేమ్, టీవీ, రిమోట్ కంట్రోల్ సిమ్యులేటర్ యాప్స్ ఉన్నాయి. ఈ 85 యాప్స్‌ని 90 లక్షల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు గుర్తించారు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాప్స్ ని గుర్తించి డౌన్లోడ్ చేసుకోవాలి. ధర్డ్ పార్టీ యాప్స్ ని అసలు నమ్మకండి.

పిన్ కోడ్స్, పాస్ వర్డ్స్

పిన్ కోడ్స్, పాస్ వర్డ్స్

పిన్‌కోడ్స్, పాస్‌వర్డ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వీటిని ఇచ్చే సమయంలో అందరూ 12345, ఇలా చాలా ఈజీగా ఉండేవి ఇస్తుంటారు. ఇది చాలా డేంజర్. హ్యాకర్లు ఈజీగా డేటాను పసిగట్టేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.

phone up-to-date and protect

phone up-to-date and protect

గూగుల్ ఆపిల్ నుంచి మీ ఫోన్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండండి. దీని వల్ల ఫోన్ స్ట్రక్ కాకుండా హ్యాక్ కాకుండా ఉంటుంది. అప్ డేట్ చేయకపోవడం వల్ల ఫోన్ ఒక్కోసారి స్ట్రక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

permissions” and “access

permissions” and “access

ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా యాప్స్ మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేయగానే Permissions" and "access" for contacts, camera, location, gallery, sensorsని యాక్సస్ చేయాలా అని అడుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సస్ ఇవ్వవద్దు.

Public Wi-Fi networks

Public Wi-Fi networks

ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎక్కడ వైఫై కనిపించినా వెంటనే వాడేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. బయట వైఫై లను అసలు ముట్టుకోకండి. వాటిని వదిలేయడమే ఉత్తమం.

Best Mobiles in India

English summary
Five things you should do to protect mobile data and privacy from any security threat

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X