పేటీఎంకు షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్..ఇక భారీ డిస్కౌంట్లే

Written By:

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ పేటీఎంకు షాకిచ్చింది. ఇకపై పేటీఎం నుంచి చెల్లింపులు జరపకుండా తన సొంత వ్యాలెట్ ఫోన్‌పేను మార్కెట్లోకి వదిలింది. ఈ వ్యాలెట్ ద్వారా మీరు ఫ్లిప్‌కార్ట్ లో ఇక ఏ వస్తువైనా కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ నాటికి ఈ యాప్ 12 మిలియన్ల మందికి చేరాలనే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ ముందుకు దూసుకువెళుతోంది. సంచలనం రేపుతున్న వ్యాలెట్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Smartphones, laptops, tablets

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెజారిటీ వాటా కోసం

మార్కెట్లో ఎలాగైనా మెజారిటీ వాటాను దక్కించుకోవాలనే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ తన సొంత డిజిటల్ వ్యాలెట్ 'ఫోన్‌పే'ను ఆవిష్కరించింది. అమెజాన్ ను ఎదుర్కునేందుకు ఈ వ్యాలెట్ తనకు ఉపకరిస్తుందని ధీమాతో ఉంది.

పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి డిజిటల్ వ్యాలెట్లు

ఇప్పటికే పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి డిజిటల్ వ్యాలెట్లు అందుబాటులో ఉండగా, వాటితో పోటీ పడి కేవలం నాలుగు నెలల్లో రూ. 6,600 కోట్ల విలువైన లావాదేవీలను జరపడమే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ ఈ తాజా చెల్లింపు విధానాన్ని ప్రారంభించింది.

బ్యాంకు ఖాతా నుంచే నగదు లావాదేవీలు

బ్యాంకు ఖాతా నుంచే నగదు లావాదేవీలు జరుగుతాయని, మొబైల్ వ్యాలెట్‌లో నిధులు దాచాల్సిన అవసరం లేదని ఫ్లిప్‌కార్ట్ తేల్చి చెప్పింది.

కొనుగోళ్ళకు భారీ రాయితీలు

ఇక దీన్ని ప్రమోట్ చేసేందుకు నిర్ణయించుకున్న ఫ్లిప్ కార్ట్, 'ఫోన్ పే' మాధ్యమంగా జరిపే కొనుగోళ్ళకు భారీ రాయితీలు ఇవ్వాలని భావిస్తోంది. భారీ ఆఫర్లు ప్రకటించడమే లక్ష్యంగా పనిచేయాలని వ్యూహాలు రచిస్తోంది.

ఫోన్ పే'ను మరింతగా విస్తరించేందుకు

ఫోన్ పే'ను మరింతగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలను రూపొందించినట్టు సీఈఓ సమీర్ నిగమ్ వెల్లడించారు. ఈ సంవత్సరం చివరి నాటికి 2.5 నుంచి 3 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు, కోటి మంది యాక్టివ్ యూజర్లను పొందడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

అలీబాబా అండతో స్నాప్ డీల్, పేటీఎం సంస్థలు

చైనా దిగ్గజం అలీబాబా అండతో స్నాప్ డీల్, పేటీఎం సంస్థలు దూసుకుపోతున్న వేళ, తన పరిధిలోని చెల్లింపులకు సైతం డిజిటల్ వ్యాలెట్ ఉండాలన్న లక్ష్యంతో ఈ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్)ని తయారు చేసినట్టు సంస్థ ప్రకటించింది.

యస్ బ్యాంకుతో ఒప్పందం

ఈ సంవత్సరం ఏప్రిల్ లో డిజిటల్ పేమెంట్ మీడియేటర్ సేవలందిస్తున్న 'ఫోన్ పే'ను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్, ఆపై దాన్ని యూపీఐగా మార్చింది. దీన్ని బ్యాంక్ ఆధారిత వ్యాలెట్ గా మార్చేందుకు యస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.

పేమెంట్ గేమ్ లో ఫ్లిప్ కార్ట్

అయితే పేమెంట్ గేమ్ లో ఫ్లిప్ కార్ట్ ఆలస్యంగా ప్రవేశించిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. స్నాప్ డీల్ కు ఇప్పటికే ప్రీ రీచార్జ్ వ్యాలెట్ ఉండగా పేటీఎంకు ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా అండ ఉంది.

నంబర్ వన్ డిజిటల్ వ్యాలెట్ గా ఉన్న పేటీఎం

ఇండియాలో ఇప్పటికే నంబర్ వన్ డిజిటల్ వ్యాలెట్ గా ఉన్న పేటీఎంలో 10 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ 'ఫోన్ పే' ఏ మేరకు విజయవంతం అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Flipkart wants to load PhonePe in 12 million mobiles
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot