ఈ రోజు గూగుల్ డూడుల్ ప్రత్యేకత: మేరీ క్యూరీ

Posted By: Staff

ఈ రోజు గూగుల్ డూడుల్ ప్రత్యేకత: మేరీ క్యూరీ

ప్రముఖ సెర్ట్ ఇంజన్ గెయింట్ గూగుల్ ప్రముఖులకు తనదైన శైలిలో నివాళులు అర్పిస్తుంది. ఇందుకొసం గూగుల్ ప్రతిష్టాత్మంకగా ప్రవేశపెట్టిన కార్యక్రమం పేరు 'గూగుల్ డూడుల్'. ఈరోజు గూగుల్ డూడుల్‌లో నోబెల్ ప్రైజ్ బహుమతి గ్రహీత, ప్రముఖ ప్రసిద్ద భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త అయిన మేరీ క్యూరీకి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తుంది. క్యాన్సర్‌తో భారిన బాధితుల కొసం రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్‌ని సొంతం చేసుకొవడం జరిగింది.

ఇక మేరీ క్యూరీ బాల్యం గనుక చూసినట్లేతే మారియా స్క్లొడొస్క పోలండ్ రాజధాని నగరమైన వార్సాలో నివసిస్తున్న బ్రోనిస్లావా మరియు వ్లాడిస్లా స్క్లొడొస్కి అనబడే పోలిష్‌ దంపతులకు జన్మించినది. వీరు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తి చేసేవారు. మారియా వారికి కలిగిన ఐదుగురి సంతానంలో చిన్న అమ్మాయి. మారియా చిన్న వయసులోనే సోదరి హెలెనా మరియు తల్లి చనిపోయారు. చిన్నతనంలో అత్యధిక శ్రద్ధతో చదువు కొనసాగించింది. ఒక్కోసారి చదువులో నిమగ్నమయ్యి అన్నం తినడం కూడా మరచిపోయేది. 15 సంవత్సరాల వయస్సులో ఆమె చదువుతున్న తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులతో హైస్కూల్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైనది.

అమ్మాయి అవడం వల్లనూ, ఇంకా రష్యా మరియు పోలండ్‌ల మధ్య ఉన్న గొడవల వల్ల అప్పట్లో ఆమెకు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకలేదు. భోధనలు చేస్తూ సంపాదించిన డబ్బులతో ఆమె వార్సాలోని ఫ్లోటింగ్ యూనివర్సిటిలో చదువుకొనసాగిస్తూ పారిస్‌లో వైద్యాన్ని అభ్యసిస్తున్న సోదరికి అండగా నిలిచింది. 1891 లో కూడబెట్టుకున్న ధనంతో ఆవిడ పారిస్ చేరుకున్నది.

పారిస్‌లో ఈమె ఉన్నత విద్యను అభ్యసించి తన పరిశోధనలను ప్రారంభించింది. 1903లో హెన్రి బెకెరెల్‌ పర్యవేక్షణలో ఇఎస్‌పిసిఐ ) ఫ్రాన్సులో డాక్టరేటు పూర్తి చేసిన మొట్టమొదటి స్త్రీగా మళ్ళీ చరిత్ర సృష్టించారు. సార్బోన్‌లో తోటి ఇన్‌స్పెక్టర్‌ అయిన పియరి క్యూరీని పెళ్ళాడారు. తన పరిశోధనలను వివిధ రకాలైన స్టీల్‌ల అయస్కాంతత్వంతో ప్రారంభించారు. ఆ తరువాత మేరీ తన పరిశోధనలను రసాయన శాస్త్రంలలో కొనసాగించారు. పరిశోధనలని రేడియో ధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు పిచ్‌బ్లెండ్‌ అనబడే ఖనిజంపై సాగాయి. ఈ ఖనిజం నుండి వారు యురేనియంను వేరు చేశారు. 1898 కల్లా వారు పిచ్‌బ్లెండ్‌లో యురేనియంకన్నా ఎక్కువ రేడియోధార్మికతను కలిగియున్న పదార్థం ఉందని నిర్ధారించారు.

ఆ పదార్థానికి రేడియం అని పేరు పెట్టి 1898, డిసెంబర్‌ 26న తమ పరిశోధనను వెల్లడించారు. ఈ పరిశోధనలకు గాను సంయుక్తంగా 1903లో నోబెల్‌ బహుమతి అందుకున్నారు. మేరీ క్యూరీ మరో నోబెల్‌ బహుమతిని 1911లో అందుకున్నారు. వైజ్ఞానిక పరిశోధనలకు ఆమె చేసిన కృషి ఇతరులకు స్పూర్తిగా ఉండేలా పారిస్‌లోనూ , వార్సాలోనూ క్యూరీ ఇనిస్టిట్యూట్‌లను ప్రారంభించారు. క్యూరీని ఆదర్శంగా తీసుకుని ఎందరో మహిళలు వైజ్ఞానిక శాస్త్రాలలో తమ పరిశోధనలు కొనసాగించారు. ఇప్పటివరకు 41మంది మహిళలు నోబెల్‌ బహుమతులను అందుకున్నారు.

* భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (1903)
* డేవీ పతాకము (1903)
* మత్తెయూచీ పతాకము (1904)
* రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి (1911)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot